AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya: మరోసారి మెగా అభిమానులకు నిరాశ తప్పదా ?.. ఆచార్య రిలీజ్ పై నెట్టింట్లో సందేహాలు..

కరోనా మహామ్మారి సినీ పరిశ్రమపై భారీగానే ప్రభావం చూపింది. గత రెండేళ్లుగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ సినిమా షూటింగ్స్,

Acharya: మరోసారి మెగా అభిమానులకు నిరాశ తప్పదా ?.. ఆచార్య రిలీజ్ పై నెట్టింట్లో సందేహాలు..
Acharya
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2022 | 2:56 PM

Share

కరోనా మహామ్మారి సినీ పరిశ్రమపై భారీగానే ప్రభావం చూపింది. గత రెండేళ్లుగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ సినిమా షూటింగ్స్, విడుదలకు తీవ్ర అంతరాయం కల్పించింది. దాదాపు సంవత్సర కాలంపాటు థియేటర్లు మూతపడేలా చేసింది. దీంతో వరకు చిత్రాలు ఓటీటీలో సడిసప్పుడు లేకుండా రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ తిరిగి కోలుకుంటుంది. ఇప్పటివరకు విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాయి. దీంతో మిగిలిన పెద్ద చిత్రాలు సైతం విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఓమిక్రాన్ రూపంలో మరోసారి పంజా విసురుతోంది కరోనా. గత కొద్ది రోజులుగా దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్య్ఫూ, లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో రిలీజ్‏కు సర్వం సిద్ధమైన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడ్డాయి.

ఇదిలా ఉంటే.. మరోసారి మెగా అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా సైతం వాయిదా పడే అవకాశాలున్నాయట. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఓమిక్రాన్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారితే.. లాక్ డౌన్ విధించడం కన్ఫార్మ్ అంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కోడుతున్నాయి. అలాగే ఇప్పటికీ ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్ వివాదం తేలకపోవడం కూడా కారణంగా కనిపిస్తోందని టాక్ నడుస్తోంది. దీంతో ఆచార్య సినిమాను వాయిదా వేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్‏గా కాజల్ అగర్వాల్ నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. మణిశర్మ సంగీతం అందించారు.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌