AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: ప్రెగ్నెన్సీ విషయాన్ని కాజల్ ఇలా చెప్పేసిందా ?.. చిన్నారి కోసం ఎదురుచూస్తున్నానంటూ..

టాలీవుడ్‏లో టాప్ హీరోయిన్లలో కాజల్ ఒకరు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. చందమామ

Kajal Aggarwal: ప్రెగ్నెన్సీ విషయాన్ని కాజల్ ఇలా చెప్పేసిందా ?.. చిన్నారి కోసం ఎదురుచూస్తున్నానంటూ..
Kajal
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2022 | 3:57 PM

Share

టాలీవుడ్‏లో టాప్ హీరోయిన్లలో కాజల్ ఒకరు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో కాజల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‏గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాలకు బ్రేక్ చెప్పలేదు.

వివాహం తర్వాత.. కాజల్.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు.. నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఘోస్ట్ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ అనుహ్యంగా తను ఓకే చెప్పిన ప్రాజెక్ట్స్ అన్నింటిని నుంచి తప్పుకుంది. దీంతో కాజల్ తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఇక ఇటీవల కొత్త సంవత్సరం వేళ కాజల్ భర్త గౌతమ్ షేర్ చేసిన ఫోటోలలో కాజల్ బేబీ బంప్‏తో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్ తాను తల్లి కాబోతున్న విషయాన్ని తన ఇన్‏స్టా వేదికగా చెప్పకనే చెప్పింది. కాజల్ ప్రెగ్నెన్సీ న్యూస్ ప్రకటించక ముందే.. అందుకు సంబంధించిన యాడ్స్ చేసేస్తుంది. ప్రేగా న్యూస్ యాడ్ చేసిన వీడియోను కాజల్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ ఏడాది చిన్నారి కోసం ఎదురుచూస్తున్నానంటూ క్యాప్షన్ ఇచ్చింది.

“ఈ ఏడాది నా చిన్నారిని కలవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ముందుగా నేను సంతోషించలేదు. కానీ ప్రేగా న్యూస్ నాకు ఖచ్చితమైన.. వేగవంతమైన ఫలితాలను సులభంగా అందించడమే కాకుండా.. గర్భధారణ ప్రయాణం నాకు సరైన మార్గంలో ప్రారంభమైందని నేను నమ్ముతున్నాను.. ఇది నేను ఎందుకు ఎంచుకున్నానో తెలుసుకోవడానికి నా వీడియో చూడండి” అంటూ రాసుకొచ్చింది కాజల్. ఇది చూసిన నెటిజన్స్ కాజల్‎కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..