Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner Kohli: కోహ్లీ వరుస వైఫల్యాలపై స్పందించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌.. ఏమన్నాడంటే..

David Warner Kohli: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇటీవల వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గడిచిన రెండేళ్లుగా ఆయన బ్యాటింగ్ తీరు సరిగా ఉండడం లేదు. కోహ్లీ సెంచరీ చేయక..

David Warner Kohli: కోహ్లీ వరుస వైఫల్యాలపై స్పందించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌.. ఏమన్నాడంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 08, 2022 | 3:57 PM

David Warner Kohli: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇటీవల వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గడిచిన రెండేళ్లుగా ఆయన బ్యాటింగ్ తీరు సరిగా ఉండడం లేదు. కోహ్లీ సెంచరీ చేయక సుమారు రెండేళ్లు దాటేసింది. దీంతో కోహ్లీ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక విరాట్‌కు ఇటు ప్రేక్షకులే కాకుండా తోటి ఆటగాళ్లు కూడా అభిమానులు ఉన్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే విరాట్ వైఫాల్యాలపై ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. కోహ్లీ ఆటతీరును విమర్శిస్తున్న వారు అతడి పరిస్థితి అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించాడు.

తాజాగా ఓ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వార్నర్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘కోహ్లీ క్రికెట్‌కు ఎంతో చేశాడు, అలాంటి ఆటగాడికి ‘విఫలమయ్యే హక్కు ఉంది’. రెండేళ్లుగా ఆటగాళ్లంతా ఎంతో కఠిన బయోబబుల్ లో ఉంటున్నారు, ఇప్పుడు కోహ్లీకి ఓ పాప కూడా జన్మించింది. ఆ విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలి. కోహ్లీ వైఫల్యం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అతడికి విఫలమయ్యే అవకాశాన్నీ మనం ఇవ్వాలి. అతడికి ఆ హక్కుంది.

స్టీవ్‌స్మిత్‌ కూడా గత నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కానీ, అతడు ప్రతి నాలుగు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ చేస్తాడని లెక్కలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. అర్థం చేసుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు వార్నర్‌. దీంతో వార్నర్‌ వ్యాఖ్యలకు ఏకీభవిస్తూ కోహ్లీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Bird of the Week: అరుదైన పక్షి.. అచ్చం కర్రపుల్లలా.. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ప్రకృతి చేసిన ప్రత్యేక ఏర్పాటు

Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

PM Security Breach: ఆ అద్భుత అవకాశాన్ని మోడీ కోల్పోయారు.. ప్రధాని పంజాబ్‌ పర్యటనపై అఖిలేష్ సెటైర్లు..