AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై విరుచుకు పడ్డ డేవిడ్‌ వార్నర్.. కెప్టెన్సీ నుంచి తొలగించడంపై..

David Warner: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సన్ రైజర్స్‌ ఐపీఎల్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది ఎలాంటి కారణం చెప్పకుండా వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి..

David Warner: సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై విరుచుకు పడ్డ డేవిడ్‌ వార్నర్.. కెప్టెన్సీ నుంచి తొలగించడంపై..
6. డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ IPL 2022 వేలంలో అతిపెద్ద పేర్లలో ఒకటిగా నిలిచింది. వార్నర్ ఒక తుఫాన్ ఓపెనింగ్ బ్యాటింగ్‌తో ఏ జట్టులోనైనా ప్రవేశించగలడు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉన్నాడు. అయితే, SRHతో అతని చివరి కెప్టెన్సీ అనుభవం అంతగా బాగోలేదు. కానీ, అతను 2016లో హైదరాబాద్ ఫ్రాంచైజీని టైటిల్ విజయానికి నడిపించాడని మర్చిపోకూడదు.
Narender Vaitla
|

Updated on: Jan 08, 2022 | 6:32 PM

Share

David Warner: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సన్ రైజర్స్‌ ఐపీఎల్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది ఎలాంటి కారణం చెప్పకుండా వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సన్‌రైజర్స్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం చర్చనీయాశంగా మారింది. ఈ నిర్ణయంపై గతంలో పలుసార్లు మాట్లాడిన వార్నర్‌, తాజాగా మరోసారి తనమనసులోని మాటను బయటపెట్టాడు. తాజాగా ‘బ్యాక్​స్టేజ్​ విత్ బోరియా’ అనే కార్యక్రమంలో వార్నర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై ఒకింత విరుచుకుపడ్డాడని చెప్పాలి.

ఈ సందర్భంగా వార్నర్‌ మాట్లాడుతూ.. ‘సన్​రైజర్స్​ యాజమాన్యం తీరుపై అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కెప్టెన్సీ నుంచి తప్పించి కనీసం జట్టులో కూడా అవకాశం కల్పించకుండా చేశారు. యాజమాన్యం దీంతో జట్టులోని ఇతర ఆటగాళ్లకు ఎలాంటి సందేశం ఇస్తోంది. యువ ఆటగాళ్లకు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి.? మరీముఖ్యంగా నన్ను బాధించే అంశం ఏమిటంటే.. ప్రస్తుతం జట్టులో ఉన్నవారు కూడా ‘మా పరిస్థితీ ఇలానే అవుతుందేమో?’ అని ఆలోచిస్తారు.

నా ఫామ్‌, కెప్టెన్సీ విషయంలో మేనేజ్​మెంట్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారు అవకాశం ఇవ్వలేదు’ అని వాపోయాడు వార్నర్‌. మరి వార్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి చర్చకు దారి తీస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే వార్నర్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Also Read: Imran Khan: సమస్యల సుడిగుండంలో పాక్.. సాయం కోసం డ్రాగన్ వైపు చూపు.. వచ్చే నెల చైనాకు ఇమ్రాన్..

Viral Video: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

Viral Video: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్