Viral Video: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

చోరీలు చెయ్యడంలో ఈ దొంగ స్టయిలే వేరు. తాజాగా ఓ దొంగ పోలీసులకు చిక్కాడు. అతడికి ఒక్క రబ్బరు బ్యాండ్‌ ఉంటే చాలు.. అదే అతడి ఆయుధం.

Viral Video:  ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ... ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్
Cars Theif
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 08, 2022 | 4:08 PM

చోరీలు చెయ్యడంలో ఈ దొంగ స్టయిలే వేరు. తాజాగా ఓ దొంగ పోలీసులకు చిక్కాడు. అతడికి ఒక్క రబ్బరు బ్యాండ్‌ ఉంటే చాలు.. అదే అతడి ఆయుధం. ఊర్లలో పిట్టలను కొట్టే వారి తరహాలో ఇతను హెయిర్ పిన్‌కి రబ్బర్ బ్యాండ్‌ కట్టి, దానికి ఓ చాక్లెట్ కవరును కడుతున్నాడు. ఆ కవరు మధ్యలో చిన్న రాయిని పెడుతున్నాడు. రాయిని లాగి… కారు అద్దంవైపు గురిపెడుతున్నాడు. వేగంగా దూసుకెళ్లే రాయి… కారు అద్దాన్ని పగలగొడుతోంది. వెంటనే తన పనికానిచ్చేస్తున్నాడు. అంత ఈజీగా ఇతను చోరీలు చేస్తున్నాడు. ఇలా చేసినప్పుడు అద్దం పగిలిన శబ్దం పెద్దగా రాకపోవడంతో ఎవరికీ ఆ విషయం తెలియదు. అందుకే ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఈ దొంగను దర్యాప్తు చేసిన పోలీసులు అతను చోరీలకు పాల్పడుతున్న విధానం గురించి విని నమ్మలేదు. అయితే అతను పోలీసులు ఎదురుగానే రబ్బర్ బ్యాండ్‌తో కార్ల అద్దాలు పగలగొట్టి చూపించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోని IPS ఆఫీసర్ రుపిన్ శర్మ… తన ట్విట్టర్ అకౌంట్లో జనవరి 6న పోస్ట్ చేశారు. “పార్క్ చేసిన కార్లలో విలువైన వస్తువులు ఉంచకండి. వాళ్లు రబ్బర్ బ్యాండ్‌తో గ్లాస్ పగలగొట్టగలరు. తమిళనాడులో ఇది జరిగింది” అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చెయ్యడానికే పోలీసులు ఈ విషయాన్ని మీడియా మందుంచారు. సో… కార్ పార్క్ చేసి.. లాక్ వేసినంత మాత్రాన అది సేఫ్‌గా ఉంటుందనీ, అందులోని వస్తువులు సురక్షితంగా ఉంటాయని గ్యారంటీ లేదు. అందుకే ఎంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ప్రస్తుతం ఈ ఖతర్నాక్ దొంగ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Also Read: రోడ్డు ప్రమాదంలో అన్న స్పాట్ డెడ్.. చూసేందుకు వెళ్తూ తమ్ముడు కూడా…

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. దక్షిణ భార‌త‌దేశంలో తొలిసారి