IND vs SA ODI Series: వన్డే సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా ప్లేయర్స్.. నెట్టింట్లో సందడి చేస్తోన్న ఐదుగురు ఆటగాళ్లు..!
India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు ముగిసిన తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇందుకోసం పలువురు యువ ఆటగాళ్లకు టీమిండియాలో అవకాశం లభించింది.
India vs South Africa: భారత క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్ తర్వాత జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఆటగాళ్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సిరీస్ కోసం టీమ్ ఇండియా యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, ప్రసీద్ధ్ కృష్ణ ఇందులో ఉన్నారు. ఈమేరకు శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్‌లు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు.
టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ట్విట్టర్‌లో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో అతనితో పాటు శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. విశేషమేమిటంటే ఈ ఆటగాళ్లంతా మాస్క్‌లు ధరించి కూర్చున్నారు. ఫోటో క్యాప్షన్‌లో ఇషాన్ ముసుగు ఎమోజీని పంచుకున్నాడు. టీమ్ ఇండియా ఆటగాళ్ల ఈ ఫోటోను ఒక్క గంటలో వేల మంది లైక్ చేశారు. అలాగే దీనిపై పలువురు స్పందించారు.
టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా 113 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సెంచూరియన్‌లో జరిగింది. కాగా జోహన్నెస్‌బర్గ్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరిగింది. ఇందులో దక్షిణాఫ్రికాపై భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది. ఆ తర్వాత జనవరి 19, 21, 23 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.
The boys ? pic.twitter.com/4kRb5WKZHL
— Ishan Kishan (@ishankishan51) January 8, 2022
David Warner Kohli: కోహ్లీ వరుస వైఫల్యాలపై స్పందించిన ఆస్ట్రేలియా ఓపెనర్.. ఏమన్నాడంటే..