AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. 6.46 శాతం వడ్డీకే రుణం.. ఎలా పొందాలంటే?

ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి శుభవార్త. అతితక్కువ వడ్డీతో సొంతింటిని నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ సహా వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ నేతృత్వంలోని నావీ సంస్థ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.

Home Loan: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. 6.46 శాతం వడ్డీకే రుణం.. ఎలా పొందాలంటే?
Home Loan
Balaraju Goud
|

Updated on: Jan 08, 2022 | 3:08 PM

Share

Home loan offers: ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి శుభవార్త. అతితక్కువ వడ్డీతో సొంతింటిని నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ సహా వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ నేతృత్వంలోని నావీ సంస్థ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నావి ఫిన్‌సర్వ్ రుణ గ్రహీతలకు సదుపాయాన్ని అందిస్తోంది. హోమ్‌ లోన్స్‌కు తక్షణ ఆమోదం అందిస్తున్నామని తెలిపింది. బ్యాంకులు, ఇతర హోమ్ లోన్ ఫైనాన్స్ కంపెనీల కన్నా వడ్డీతో పాటు, త్వరగానే రుణాలు అందిస్తామని కంపెనీ వెల్లడించింది. రుణ మంజూరు ప్రక్రియ మొత్తం డిజిటల్ రూపంలో జరుగుతుందని పేర్కొంది.

హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు కూడా 6.46 శాతం నుంచి ప్రారంభం అవుతోందని కంపెనీ తెలిపింది. అంటే బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీల కన్నా ఇది తక్కువ వడ్డీ రేటు కావడం గమనార్హం. రనూ.20 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు హోమ్ లోన్ పొందొచ్చు. 25 ఏళ్ల వరకు లోన్ టెన్యూర్ ఎంచుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇందుకోసం ప్రముఖ నగరాలను ఎంపిక చేసింది నావీ సంస్థ. హైదరాబాద్ సహా దేశంలో పలు పట్టణాల్లో నివసించే వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు, మైసూర్, హుబ్లి, దేవంగిరి, గుల్‌బర్గా, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో హౌసింగ్ లోన్ ప్రాజెక్ట్స్ మంజూరు చేస్తున్నామని, త్వరలోనే ముంబై, పుణేలో కూడా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించింది.

మంచి క్రెడిట్ స్కోర్, లోన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ కలిగి స్థిరమైన ఆదాయం పొందే వారికి తక్కువ వడ్డీ రేటుకే లోన్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. నావి యాప్ ద్వారానే సులభంగానే లోన్ అప్లై ప్రాసెస్ పూర్తి చేయొచ్చని, బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదని వివరించింది. అదనపు అడ్మినిస్ట్రేటివ్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, సెంట్రల్ రిజిస్ట్రీ ఫైలింగ్ చార్జీలు వంటివి ఉండవని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ మాజీ కోఫౌండ్ సచిన్ బన్సాల్ ఈ నావి టెక్నాలజీస్ అనే కంపెనీని 2018లో స్టార్ట్ చేశారు.

హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావించే వారు ముందుగా నావి యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత పర్సనల్, ఎంప్లాయిమెంట్ వివరాలు అందించాలి. మంత్లీ ఇన్‌కమ్ ప్రూఫ్, ప్రాపర్టీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. మొబైల్ డేటా, స్టోరేజ్, కాంటాక్ట్స్ యాక్సెస్ కోసం పర్మిషన్ ఇవ్వాలి. ఇకపోతే ఈ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే లోన్ పొందొచ్చు. అదనపు చార్జీలు ఉండవు. అయితే మీరు లోన్ పూర్తిగా చెల్లించేంత వరకు ఈ యాప్‌ను ఫోన్ నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేయలేరు. ప్రైవసీ ఆందోళనలు ఉండొచ్చు.

Read Also…. SEBI Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు..

Follow Us
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!