Coronavirus: సినిమా తారలను వెంటాడుతున్న కరోనా.. వైరస్‌ బారిన పడిన సత్యరాజ్‌.. ఆస్పత్రిలో చికిత్స..

సినిమా పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్, టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు కొవిడ్‌ బారిన పడుతున్నారు.

Coronavirus: సినిమా తారలను వెంటాడుతున్న కరోనా.. వైరస్‌ బారిన పడిన సత్యరాజ్‌.. ఆస్పత్రిలో చికిత్స..
Satyaraj
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2022 | 6:47 AM

సినిమా పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్, టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. తాజాగా తమిళ సీనియర్‌ నటుడు, ‘బాహుబలి’ కట్టప్ప వైరస్‌ బాధితుల జాబితాలో చేరారు. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. అయితే కట్టప్ప ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా తాజాగా స్టార్‌ హీరోయిన్‌ త్రిష కరోనా బారిన పడింది. అంతకుముందు స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, ప్రిన్స్‌ మహేష్‌ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్‌, విశ్వక్‌సేన్‌ లు కూడా కరోనాకు చిక్కారు. వీరితో పాటు కోలీవుడ్‌కు చెందిన కమెడియన్‌ వడివేలు, చియాన్‌ విక్రమ్‌, అర్జున్‌, కమల్‌ హాసన్‌ తదితరులు కొవిడ్‌ బాధితుల జాబితాలో చేరారు. కాగా తమిళనాడులో ఒమిక్రాన్ తో పాటు కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.  దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అదేవిధంగా సండే లాక్ డౌన్ ను కూడా విధించారు.  కరోనా కేసుల తీవ్రతను బట్టి మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read:

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కరోనా పాజిటివ్‌..

Coronavirus: కరోనా ఎఫెక్ట్‌.. సోమవారం నుంచి పూరీ జగన్నాథుడి ఆలయం మూసివేత..

ప్రధాని పర్యటనపై కేంద్రం అతిగా స్పందిస్తోంది.. ఈ సాకుతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది: పంజాబ్‌ సీఎం చరణజీత్ సింగ్