Anup Rubens: అందుకే ఒక‌టికి ప‌దిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది.. అనూప్ రూపెన్స్ ఆసక్తికర కామెంట్స్..

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది.

Anup Rubens: అందుకే ఒక‌టికి ప‌దిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది.. అనూప్ రూపెన్స్ ఆసక్తికర కామెంట్స్..
Anup
Follow us

|

Updated on: Jan 07, 2022 | 5:08 PM

Bangarraju: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నాగార్జున‌ గారు ఒక పాట‌ను ఆల‌పించారు. ఈ పాట‌ల‌కు సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ బాణీలు స‌మ‌కూర్చారు. ఈ సంద‌ర్భంగా అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..

నాగార్జున గారితో సినిమా చేయ‌డంఎంతో ప్రోత్సాహంగా వుంటుంది. ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం క‌లుగుతుంది. ఆయ‌న‌తో నేనే కాదు ఎవ‌రు చేసినా ఫ్రీడమ్ ఇస్తారు. ప్ర‌తీ టెక్నిషియ‌న్ ఫీలింగ్ ఇదే. దానితో ఇంకాస్త బాధ్య‌త‌గా వుండాల‌నుకుంటారు. నాదృష్టిలో ఎఫర్ట్ అనేది అన్ని సినిమాల‌కు పెడ‌తాం. ఒక్కో హీరోతో సినిమా చేయ‌డం అనేది మాతృ సంస్థ‌లా ఫీల‌య్యే వాతావ‌ర‌ణం క‌నిపించ‌డ‌మే. మన‌కు ఏం కావాలో వారికి తెలుసు.వారు ఏం కోరుకుంటున్నారో మ‌న‌కు తెలుసు. ఇదంతా కాంబినేష‌న్ వ‌ల్లే జ‌రుగుతుంది. ద‌ర్శ‌కుడు, హీరో అనే కాంబినేష‌న్‌లు ఔట్‌పుట్ క్లారిటీ ఇవ్వ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఫైన‌ల్‌గా ఏ సినిమాకైనా ప‌డే క‌ష్టం ఒక్క‌టే అని అన్నారు అనూప్. ఇంత‌కుముందు చేసిన సోగ్గాడే చిన్నినాయ‌నా అనేది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. దానితో కాస్త ఒత్తిడి అనేది స‌హ‌జ‌మే. ఎందుకంటే దానితోనే కంపేర్ చేస్తుంటారు. అందుకే ఒక‌టికి ప‌దిసార్లు క్రాస్ చెక్ చేసుకుని మంచి ఔట్‌పుట్ ఇవ్వాల్సి వుంటుంది. నాగార్జున సార్ కూడా మ‌న‌కు ఓ బెంచ్ మార్క్ వుంద‌నేవారు. అలాగే ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ కృష్ణ కూడా అంతే ఎఫర్ట్  పెట్టి చేశారు.

నాగార్జున గారితో పాట పాడించాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది అన్న ప్రశ్నకు అనూప్ సమాధానం ఇస్తూ.. నేను `మ‌నం` సినిమా చేస్తుండ‌గా పియోరే.. సాంగ్‌ను ఆయ‌న లొకేష‌న్‌లో స‌ర‌దాగా పాడారు. ఆ వాయిస్ బాగా న‌చ్చింది. మీ వాయిస్ బాగుంది. ఓ పాట పాడండి అన్నా. అలా `సోగ్గాడే..లో డిక్క‌డిక్క‌డుండుం.. అనే ది ట్రై చేశాం. ఆ పాట‌ను ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. దానికి కొన‌సాగింపుగా పాడించాల‌ని బంగార్రాజులో పాడారు. ఈ పాట పాత్ర‌ప‌రంగా సంద‌ర్భానుసారంగా ఆయ‌న పాడితేనే మ‌రింత ఎఫెక్ట్ వుంటుంది. అలా సినిమాకు క‌లిసి వ‌చ్చింది. దానితో మొత్తం సాంగ్ ఆయ‌నే పాడేశారు. నాకు న‌టించ‌డం క‌ష్టం. ఎవ‌రి ప‌ని వారు చేయాలి. కానీ కొంత‌మంది ఏదైనా ప‌ట్టుద‌ల‌తో చేసి స‌క్సెస్ సాధిస్తారు.

ఇది గ్రామీణ క‌థ‌. ఏ ఒక్క సాంగ్‌కూ పాశ్చ‌త్య ప‌రిక‌రాలు వాడ‌లేదు. సాంప్ర‌దాయంగా వుంటాయి. ప‌ల్లెటూరి ఫీల్‌ను క‌లిగిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఆహ్లాద‌క‌రంగా వుంటుంది. వెస్ట్ర‌న్ ప‌రిక‌రాలు చాలా త‌క్కువ‌గా వాడాం. అలాగే ఈ సినిమాకు రీరికార్డింగ్ ముందుగానే పూర్త‌యింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే త‌క్కువ స‌మ‌యంలోనే పూర్తి చేశాం. స‌హ‌జంగా పెద్ద సినిమాల‌కు టైం తీసుకోవాలి. కానీ ఈ సినిమాకు 12గంట‌లు ప‌నిచేయాల్సింది 20గంట‌లు ప‌నిచేశాం. అలా సాంకేతిక సిబ్బంది అంద‌రూ ప‌నిచేశారు. సినిమా కూడా నాలుగు నెల‌లోనే పూర్త‌యింది. ఇలా అంద‌రూ చేయ‌బ‌ట్టే అనుకున్న టైంలో వ‌చ్చింది. ఇక ఇప్ప‌టికే మూడు పాట‌లు విడుద‌ల చేశాం. ల‌డ్డుండా.. జ‌నాల‌కు బాగా చేరువ‌యింది. `నా కోసం` అనే మెలోడి సాంగ్‌, త‌స్సాదియ్యా.. బాగా ఆద‌ర‌ణ పొందాయి. మూడు రోజుల్లో మ‌రో సాంగ్ రాబోతుంది అని చెప్పుకొచ్చారు అనూప్ రూపెన్స్. ఇక బంగార్రాజు సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు..

Major : మహేష్, దుల్కర్ చేతుల మీదుగా అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్.. ఆకట్టుకుంటున్న హృదయమా సాంగ్..

Samantha’s Yashoda: శరవేగంగా యశోద మూవీ షూటింగ్.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సమంత..

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.