AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 16 ఏళ్లకే చేదు అనుభవం.. సినిమా ఆడిషన్ కోసం పిలిచి.. బుల్లితెర నటి షాకింగ్ కామెంట్స్..

సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా వింటుంటాం. సినిమాల్లో ఆఫర్స్ అంటూ వచ్చిన అమ్మాయిలతో కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తారని.. కమిట్మెంట్ అడుగుతుంటారని ఇప్పటికే ఎంతోమంది సినీతారలు షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. తాజాగా ఓ బుల్లితెర నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

Tollywood: 16 ఏళ్లకే చేదు అనుభవం.. సినిమా ఆడిషన్ కోసం పిలిచి.. బుల్లితెర నటి షాకింగ్ కామెంట్స్..
Rashami Desai
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2024 | 8:01 AM

Share

సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా వింటుంటాం. సినిమాల్లో ఆఫర్స్ అంటూ వచ్చిన అమ్మాయిలతో కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తారని.. కమిట్మెంట్ అడుగుతుంటారని ఇప్పటికే ఎంతోమంది సినీతారలు షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. తాజాగా ఓ బుల్లితెర నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

హిందీ బుల్లితెరపై రష్మీ దేశాయ్ చాలా ఫేమస్. ఎన్నో సీరియల్స్, రియాల్టీ షోలలో పాల్గొని చాలా పాపులర్ అయ్యింది. భోజ్‌పురి నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2006లో జీ టీవీలో ప్రసారమైన రావణ్ సీరియల్‌లో మండోతరి పాత్రను పోషించడం ద్వారా బుల్లితెర ప్రపంచంలోకి అరంగేట్రం చేసింది. హిందీ సీరియల్ ఉత్తరన్‌లో నటించిన తర్వాత ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. దిల్ సే దిల్ తక్, ఝలక్ థిక్లా జా, ఖద్రోన్ కే ఖిలాడీ సీరియల్‌ ద్వారా అభిమానులకు దగ్గరయ్యింది. ఇక బిగ్ బాస్ సీజన్ 13లో నటుడు సిద్ధార్థ్ శుక్లాతో రష్మీ గొడవతో మరింత హైలెట్ అయ్యింది. 2012లో ఉత్తరాన్ సహనటుడు నందిస్ సంధును వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. 2012 లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

“ఒక సినిమా కోసం నన్ను ఆడిషన్ కోసం పిలిచారు. అప్పుడు నా వయసు కేవలం 16 ఏళ్లు. అక్కడ ఒక వ్యక్తిని మాత్రమే ఆడిషన్‌కు అడిగారు. నేను కాస్త తడబడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. నేను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో ఎంతో అసౌకర్యంగా అనిపించింది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక అక్కడి నుంచి తప్పించుకోని బయటకు వచ్చాను. ఇంటికి వచ్చాక మా అమ్మకు జరిగిన విషయం చెప్పాను. మరుసటి రోజు మా నేను చెప్పిన వ్యక్తిని కలవడానికి వచ్చింది. నాతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప పగలగొట్టింది. ఆ వ్యక్తి ఇప్పటికీ ఆ ఘటను మర్చిపోలేడు. ఇప్పటికీ ఆ సంఘటన నాకు గుర్తుంది. చిత్ర పరిశ్రమలో దారితప్పడం, లైంగిక వేధింపులు వాస్తవమే. ప్రతి రంగంలో మంచివారూ, చెడ్డవారూ ఉంటారు. ఇండస్ట్రీలో మంచి అనుభవాన్ని పొందేందుకు అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అదృష్టం వచ్చింది. ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని నాకు తెలుసు ” అంటూ చెప్పుకొచ్చింది రష్మీ దేశాయ్.

సినీరంగంలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటారనే విషయం ఇటీవల బహిరంగ చర్చగా మారింది. ఇండస్ట్రీలో నెపోటిజం, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. మీటూ సంస్థ ఆవిర్భవించిన తర్వాత తమకు ఎదురైన పరిస్థితులను నటీమణులు బయట పెడుతున్నారు. ఇటీవల కేరళ చిత్రపరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.