AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaran: అమరన్ మూవీ విలన్‏ ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లవరా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో శివకార్తికేయన్, సాయి పల్లవి అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. ఇక డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని ఎంతో అందంగా తెరకెక్కించారు. అయితే ఇందులో ఉగ్రవాది ఆసిఫ్ వానీ పాత్రలో నటించిన విలన్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

Amaran: అమరన్ మూవీ విలన్‏ ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లవరా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
Amaran
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2024 | 7:29 AM

Share

ఈ ఏడాది దీపావళీకి థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో అమరన్ ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండానే థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. శివకార్తికేయన్ సినిమాల్లో 200 కోట్ల రూపాయల మార్కును దాటిన తొలి చిత్రం ‘అమరన్’. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఓ అబ్బాయి.

‘అమరన్’ సినిమాలో ఉగ్రవాది ఆసిఫ్ వానీని హతమార్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ముకుంద్ వరదరాజన్ మరణించాడు. ఆసిఫ్ వానీ పాత్రలో కనిపించిన కుర్రాడి గురించి ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ అతనెవరో తెలుసా.. ఆసిఫ్ వానీ అసలు పేరు రోహ్మన్ షాల్. అతను మోడల్ , మాజీ మిస్ యూనివర్స్, ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ మాజీ ప్రియుడు కూడా. 2018లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వీరి ప్రేమ చిగురించింది. వీరిద్దరు దాదాపు 6 ఏళ్లపాటు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2023లో వీరిద్దరు విడిపోయినట్లు ఇన్ స్టాలో ప్రకటించారు. రోహ్మన్ షాల్ కంటే సుస్మితా సేన్ మధ్య 15 సంవత్సరాల పెద్దది. దీంతో వీరిద్దరి ప్రేమాయణం, డేటింగ్ అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

బ్రేకప్ ప్రకటించిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి చాలా చోట్లకు వెళ్లారు. తమ మధ్య రిలేషన్ షిప్ ముగిసింది కానీ తమ స్నేహం మాత్రం కొనసాగుతుందని సుస్మితా సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇన్నాళ్లు సుష్మితా సేన్ ప్రియుడిగానే నెట్టింట ఫేమస్ అయిన రోహ్మన్ షాల్.. ఇప్పుడు అమరన్ చిత్రంలో అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. దీంతో అతడికి సౌత్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by rohman shawl (@rohmanshawl)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు