Bigg Boss 8 Telugu: గెలిచేది ఒక్కరే కదా.. నబీల్‏కి తల్లి సలహాలు.. ఏడ్చేసిన తేజ..

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ముందుగా హౌస్మేట్స్ కోసం సీజన్ మొత్తం స్వీట్స్ తినకుండా ఉంటున్న నబీల్ కు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ముందుగా హల్వా.. ఆ తర్వాత మరో స్వీట్ ఇచ్చి తినమని ఆదేశించాడు. మరోవైపు మెయిన్ డోర్ నుంచి నబీల్ తల్లి ఇంట్లోకి రావడంతో కంటెస్టెంట్స్ అందరూ ఆమె దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

Bigg Boss 8 Telugu: గెలిచేది ఒక్కరే కదా.. నబీల్‏కి తల్లి సలహాలు..  ఏడ్చేసిన తేజ..
Bigg Boss 8 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2024 | 6:46 AM

బిగ్‌బాస్ హౌస్‏లో నామినేషన్స్ ప్రక్రియ జరిగిపోయింది. ఈ వారం మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో కంటెస్టెంట్లకు సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒక వారం ఇంటి మొత్తానికి అన్‏లిమిటెడ్ ఫుడ్ అందించడానికి నబీల్ ఈ సీజన్ అంతా స్వీట్స్ తినను అంటూ మాటిచ్చాడు. దాని ప్రకారమే తనకు చాలా ఇష్టమైనా సరే స్వీట్స్ తినకుండా నబీల్ ఉంటున్నాడు. తాజాగా నబీల్‏కు కంటిన్యూగా స్వీట్స్ పంపించాడు. ముందుగా హల్వా, ఆ తర్వాత మరో స్వీట్స్ పెట్టాడు. కన్ఫెన్షన్ రూంలో నబీల్ స్వీట్స్ తింటుండగా.. మెయిన్ డోర్ నుంచి వాళ్ల అమ్మ ఎంట్రీ ఇచ్చారు. తనను చూడగానే కంటెస్టెంట్స్ అందరూ పరిగెత్తి వెళ్లి ఆమె కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక అదంతా టీవీలో చూసి మురిసిపోయాడు నబీల్. కాసపేటి నబీల్ కూడా వెళ్లి తల్లిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. దీంతో ఇద్దరినీ కాసేపు వదిలేసి పక్కకు వెళ్లిపోయారు కంటెస్టెంట్స్. ఏట్లా ఆడుతున్నా నేను అంటూ తల్లిని అడిగాడు నబీల్. ఇండివీడ్యువల్ గా అట్లనే ఆడు. ఎమోషనల్ అసలు కావద్దు అంటూ సలహాలు ఇచ్చారు నబీల్ తల్లి.

కష్టపడి ఆడాలి.. గెలవాలి అంటే నీ ఆట నువ్వు ఆడాలి.. ఎవరి గురించి పట్టించుకోవద్దు.. ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కావొద్దు. అందరితో మంచిగానే ఉండు అంటూ ఇండైరెక్ట్ గానే హింట్స్ ఇస్తూ సలహాలు ఇచ్చింది నబీల్ తల్లి. తన బెడ్ దగ్గర ఉన్న షీల్డ్ గురించి చెప్పాడు నబీల్. ఆ తర్వాత నబీల్ తల్లితో కంటెస్టెంట్స్ అందరూ సరదాగా మాట్లాడారు. అవినాష్, రోహిణి, నబీల్, విష్ణుప్రియ నామినేషన్స్ సీన్ రీక్రియేట్ చేసి చూపించారు. అందరూ బాగా ఆడుతున్నారు. ఇలాగే ఆడండి అంటూ సూచించింది నబీల్ తల్లి. వెళ్లే ముందు తన కొడుకు కోసం ఓ ఆట ఆడాలని చెప్పాడు బిగ్‌బాస్. టేబుల్ ముందు మూడు ఎన్విలాప్.. ఒక డిస్క్ ఉంది. ఆ డిస్క్ ను మీరు విసరండి. అది ఏ ఎన్విలాప్ దగ్గర ఆగుతుందో అది మీ అబ్బాయికి మీ తరుపున ఇచ్చే గిఫ్ట్ అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఆ ఎన్విలాప్ లో అమ్మ చేతి గులాబ్ జామున్ 20 పీస్ అని రాసి ఉంది. ఇంతలో గులాబ్ జామ్ కూడా పంపించేశాడు. ఎమోషనల్ అవ్వకు.. గెలిచేది ఒక్కరే కదా.. అది గుర్తుపెట్టుకో అంటూ సలహాలు ఇచ్చి వెళ్లిపోయింది నబీల్ తల్లి.

ఇక తల్లి వెళ్లిపోగానే నబీల్ ఎమోషనల్ అయ్యాడు. డోర్ దగ్గరి నుంచి నబీల్ వస్తుంటే పట్టుకుని బుగ్గమీద కిస్ ఇచ్చాడు నిఖిల్. ఇక మరోవైపు తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరి పేరెంట్స్ వస్తారు.. కానీ నా కోసం మాత్రం రారు. ప్లీజ్ బిగ్‌బాస్.. నేను ఏడిస్తే అమ్మకు నచ్చదు.. కానీ మా అమ్మ కోసం ఏడుస్తా అనుకోలేదు. ఇంకా కష్టపడి ఆడతా బిగ్‌బాస్ ప్లీజ్. ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వొద్దు అంటూ బోరున ఏడుస్తూ కూర్చున్నాడు తేజ. కాసేపటి అవినాష్ దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నాకు తేజదే గిల్డ్ అవుతుంది. మన ఫ్యామిలీ అందరూ వస్తారు.. వాడికి రారు అంటూ నిఖిల్ అనడంతో.. నువ్వు వాడి పేరు చెప్పావా కన్ఫెన్షన్ రూంలో అంటూ క్వశ్చన్ చేశాడు అవినాష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..