Brahmamudi, November 13th Episode: రాజ్, కావ్యలను కలిపేందుకు పెద్దాయన పందెం.. ఇరుక్కున్న కళావతి!

రాజ్, కావ్యలకు సీతారామయ్య ఓ పందెం పెడతాడు. ఈ టెస్ట్‌లో రాజ్ ఓడిపోతే.. కావ్యని కోడలిగా ఇంటికి తీసుకు రావాలని చెబుతాడు. అలాగే ఈ టెస్ట్‌లో కావ్య ఓడిపోతే.. కంపెనీ మొహం కూడా చూడకూడదని చెబుతాడు. ఈ పరీక్షకు ఇద్దరూ ఒప్పుకుంటారు. మరి ఏం జరుగుతుందో చూడాలి..

Brahmamudi, November 13th Episode: రాజ్, కావ్యలను కలిపేందుకు పెద్దాయన పందెం.. ఇరుక్కున్న కళావతి!
Brahmamudi 2Image Credit source: disney hot star
Follow us
Chinni Enni

|

Updated on: Nov 13, 2024 | 9:35 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. స్వరాజ్ కంపెనీకి సీతారామయ్య స్నేహితుడు వస్తాడు. ఆయన్ని చూసిన కావ్య చక్కగా పలకరిస్తుంది. నువ్వు కొత్తగా సిఈవోగా బాధ్యతలు తీసుకున్నావని విన్నాను. కానీ ఇంత త్వరగా వాటిని వంట పట్టించుకుంటావని అనుకోలేదు అమ్మాయి అని అతను అంటే.. చెప్పండి సార్ ఏంటి ఇలా వచ్చారని కావ్య అడిగితే.. మా ఊరిలో పూర్వీకులు కట్టించిన గుడి ఉంది. అది శిథిలావస్థకు చేరింది. దాన్ని జీర్ణోద్ధారణ చేయాలి అనుకుంటున్నాం. దేవుడి విగ్రహానికి కావాల్సిన నగలు, విగ్రహాలు సంప్రదాయంగా చేయాలి అనుకుంటున్నాం. అందుకే ఆ బాధ్యత మీ కంపెనీకి ఇవ్వాలని వచ్చానని అతను అంటాడు. దేవుడికి సంబంధించిన పని మా కంపెనీకి రావడం సంతోషంగా ఉంది. ఖచ్చితంగా చేస్తామని కావ్య అంటుంది. మంచి డిజైన్స్ కావాలని.. సంప్రదాయంగా ఉండాలని చెబితే.. మూడు రోజుల్లో డిజైన్స్ మీకు చూపిస్తాం.. ఆ తర్వాతే ముందుకు వెళ్దామని కావ్య అంటుంది.

అందరి ముందూ కావ్య, రాజ్‌ల కొట్లాట..

ఆ తర్వాత శ్రుతి వస్తుంది. ఆ ఫైల్ మీద సంతకం పెట్టారా అని కావ్య అడిగితే.. ఎక్కడ మేడమ్.. ఆయన ఫైల్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయారని శ్రుతి అంటుంది. ఇంటికి వెళ్లారా.. సరే నేను నేరుగా ఇంటికి వెళ్లి ఆ ఫైల్ తీసుకొస్తా.. ఈ రోజు ఎంత లేటు అయినా మానుఫ్యాక్చర్ వాళ్లను పని పూర్తి చేయాలని చెప్పు అని కావ్య అంటుంది. ఇక నేరుగా ఇంటికి వెళ్లిన కావ్య.. మీ మనవడు ఎక్కడ ఉన్నారు? అని అడుగుతుంది. పిలుస్తారా.. నన్నే పిలవమంటారా అని కావ్య అంటే.. ఏమైంది అమ్మా.. పిలుస్తానని ఇందిరా దేవి అంటుంది. రాజ్‌ని పిలవగానే పై నుంచి దిగుతాడు. ఏంటి మీ ఉద్దేశం అని కావ్య అంటే.. నీ విషయంలోనా.. నా విషయంలోనా అని రాజ్ అంటే.. కంపెనీ విషయంలో ఆ ఫైల్ మీద సంతకం చేయకుండా ఇంటికి ఎందుకు వచ్చారు? అని కావ్య అడుగుతుంది. ఆ కంపెనీతో డీల్ చేయడం నాకు ఇష్టం లేదని రాజ్ అంటే.. మీ ఇష్టాయిష్టాలతో నాకు పనేంటి? సుపీరియర్ చెప్పింది చేయాలి. నాకు మాట చెప్పాలి కదా అని కావ్య అడిగితే.. అక్కడ ఎవరు ఉన్నారన్నది అనవసరం.. నువ్వు నాతో డిస్కర్షన్ చేశావా? అని రాజ్ అడిగితే.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా కింది ఉద్యోగులతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మిస్టర్ మేనేజర్ అని కావ్య అంటుంది. ఈ అహంకారమే మా తాతయ్య ఇచ్చిన అలుసు అని తెలుస్తుందని రాజ్ అంటే.. నేను తీసుకున్నా ఏ నిర్ణయం ఫెయిల్ కాలేదని ఇక్కడ ఉన్న అందరికీ తెలుసని కావ్య అంటుంది.

కావ్య ఆన్ ఫైర్..

ఏరా ఏంటి ఈ పిల్లల ఆటలు కావ్యకు చెప్పకుండా ఆ ఫైల్ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావని సీతారామయ్య అడుగుతాడు. ఇదొక్కటే కాదు తాతయ్య ఇంకా చాలా విషయాల్లో ఆయన ఇలాగే ఉంటున్నారని కావ్య అంటే.. ఇంత పొగరు ఉన్న ఆడదాన్ని కూడా ఎక్కడా చూడలేదని రాజ్ అంటాడు. జగదీష్ చంద్ర గారు ఆఫీస్‌కి వచ్చారు. ఆయన ఓ గుడికి సంబంధించిన నగలు, కిరీటం చేయమని చెప్పారు. ఆ డిజైన్స్ అన్నీ నేను రెండు రోజుల్లో ఇవ్వాలి. ఆయన ఆ ఫైల్‌ని ఇంటికి తీసుకొచ్చారు. నేను డిజైన్స్ మాత్రమే వేయగలను. కానీ మీ మనవడికి ఉన్న టాలెంట్, సమర్దత వేరు. ఆయన నాకు కోపరేట్ చేస్తేనే నేను ఏదన్నా చేయగలనని కావ్య అంటుంది. చూశారా తాతయ్యా నా కెపాసిటీ మీకు తెలియకపోయినా.. నా శత్రువుకు తెలుసని రాజ్ అంటాడు. శత్రువు ఎవరు? అని ఇందిరా దేవి అడుగుతుంది. ఈ కళావతి అని రాజ్ అనగానే.. పళ్లు రాలగొడతానని ఇందిరా దేవి అపర్ణ అంటుంది.

ఇవి కూడా చదవండి

రాజ్, కావ్యలకు పరీక్ష పెట్టిన సీతారామయ్య..

ఇక అప్పుడు రుద్రాణి ఎంటర్ అవుతుంది. రాజ్ మాత్రమే మన కంపెనీని సమర్దవంతంగా నడపగలడు. అది పక్కన పెట్టి.. కేవలం డిజైన్స్ వేసే ఈ కావ్యని తీసుకెళ్లి అధికారం అప్పగించారు.. అది వాడికి ఎలా నచ్చుతుందని అడుగుతుంది. అత్తా నా చెల్లి అలా తీసి పారేస్తున్నావ్ ఏంటి? కంపెనీలోకి అడుగు పెట్టగానే రూ.15 కోట్ల లాభం తీసుకొచ్చి పెట్టింది. బయటకు వెళ్లిపోయిన క్లయింట్స్‌ని తీసుకొచ్చి అగ్రిమెంట్ చేసి లాక్ చేసిందని అంటుంది. పక్క వాళ్లను మోసం చేసి సంపాదించన డబ్బు అది కూడా ఒక్కటేనా.. మా రాజ్ టాలెంట్‌తో పోల్చితే ఇదెంత అని రుద్రాణి అడుగుతుంది. ఇప్పుడేంటి? కావ్య కంటే నువ్వు మాత్రమే కంపెనీని డీల్ చేయగలవని నమ్ముతున్నావా? అని సీతారామయ్య అడుగుతాడు. అవునని రాజ్ అంటాడు. సరేలే అయితే ఒక పని చేద్దాం. జగదీష్ చంద్ర గారి ప్రాజెక్ట్ టైమ్‌కి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మీదనే విడి విడిగా పని చేయండి. దీంతో ఎవరి సమర్దత ఏంటో తేలుతుందని అంటాడు సీతారామయ్య.

పందేనికి సిద్ధమైన రాజ్, కావ్యలు..

ఈ డీల్ నాకు ఓకే అని రాజ్ అనగా.. నా చేతిలో మీ మనవడు ఓడిపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నానని కావ్య అంటుంది. కావాలనే కావ్యని తీసిపారేసినట్టు మాట్లాడతాడు రాజ్. కావ్య కూడా ధీటుగా రాజ్‌కి కావ్య కూడా పందానికి సై అంటుంది. అప్పుడే మెలిక పెడతాడు సీతారామయ్య. తొందర పడకు సుందర వదనా.. ఓడిపోతే పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు ఈ పందెంలో ఓడిపోతే కావ్యని ఈ ఇంటి కోడలిగా ఇంటికి తీసుకు రావాలని అంటాడు. ఇదెక్కడి విడ్డూరమని రుద్రాణి అడుగుతుంది. ఈ పందెలో కావ్య గెలిస్తే ఈ ఇంటికి తిరిగి వస్తుంది. నా మనవడి కాపురం చక్క బడుతుందని ఇందిరా దేవి అడుగుతుంది. దీంతో తెల్ల ముఖం వేస్తుంది రుద్రాణి. నేను ఓడిపోయే ప్రసక్తే లేదు.. ఒక వేళ ఓడిపోతే కళావతిని భార్యగా ఒప్పుకుని ఈ ఇంటికి తీసుకొస్తాను. కానీ ఈ కళావతి ఓడిపోతే ఏం చేయాలో అని రాజ్ అడిగితే.. అది కూడా నువ్వే చెప్పమని సీతారామయ్య అడుగుతాడు. కళావతి ఓడిపోతే జీవితంలో ఆఫీస్ మొహం కూడా చూడకూడదని రాజ్ అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. సరే రా ఈ పందెం మాకు ఓకే అని అందరితో పాటు ఇక కావ్య కూడా ఒప్పుకుంటుంది.

ఆయనకు నా మీద ఇష్టమే లేదు కదా..

ఆ తర్వాత ఇందిరా దేవి, సీతారామయ్యలు, అపర్ణ, కావ్యలు మీట్ అవుతారు. అమ్మమ్మా నాకు ఇది ఎలాగో ఉంది. ఈ పందెం నాకు ఒక పరీక్షలా ఉంది. నేను గెలిస్తే ఆయన ఓడిపోతాడు. ఆయన గెలిస్తే నా కాపురం ఓడిపోతుంది. ఏది జరిగినా నష్టం నాకే అని కావ్య అంటుంది. ఆయన మనసులో నేను లేననే గడప దాటి వెళ్లాను. కానీ ఇప్పుడు పందెంలో ఓడిపోతే.. ఇష్టం లేని నన్ను తీసుకు రావడంతో పాటు మరింత ద్వేషం పెంచుకుంటారని కావ్య అంటుంది. ఆయన మనసు మారి.. నన్ను నన్నుగా ఒప్పుకున్న రోజే తిరిగి వెళ్లిపోయానని కావ్య అంటుంది. అలా నువ్వు అక్కడే ఉంటే.. అది కుదరని పని.. ఆ రోజు వాడి తల్లికి సీరియస్ అయ్యిందని అరిచాడే కానీ.. నీ మీద మనసు లేక కాదని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత అపర్ణ కూడా కావ్యకి నచ్చజెబుతుంది. ఇక సరేనని కావ్య ఒప్పుకుంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..