- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Actress Satya Sri entered new home At her home town Tanuku, Shares photos
Jabardasth Satya Sri: సొంతూరులో కొత్తింటి కల సాకారం చేసుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. గృహప్రవేశం ఫొటోలు ఇదిగో
జబర్దస్త్ తో మంచి గుర్తింపు పొందిన కమెడియన్లలో సత్యశ్రీ కూడా ఒకరు. ముఖ్యంగా చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ప్రస్తుతం టీవీషోలతో పాటు సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార.
Updated on: Nov 17, 2024 | 6:59 PM

జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన అతి కొద్దిమంది లేడీ కమెడియన్లలో సత్యశ్రీ కూడా ఒకరు. దీంతో పాటు పలు టీవీషోలు, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోందీ ముద్దుగుమ్మ.

ఈ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ తదితర సినిమాల్లోనూ కనిపించింది సత్యశ్రీ. ఇలా టీవీషోలు, సినిమాలతో బిజీ బిజీగా ఉండే ఆమె తన సొంతూరులో సొంతింటి కలను సాకారం చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి అడుగు పెట్టింది సత్యశ్రీ. తాజాగా గృహ ప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించిన ఆమె అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇది ఇల్లు కాదు నా కల. కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం, కొత్త జ్ఞాపకాలు. నా సొంతూరు తణుకులో సొంత ఇల్లు' అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది సత్యశ్రీ.

సత్యశ్రీ గృహ ప్రవేశం ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీంతో పలువురు బుల్లితెర ప్రముఖులు, నెటిజన్లు సత్యశ్రీ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు




