AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఎందుకో తెలుసా? బట్టతలకు చెక్ పెట్టే విటమిన్ ఇదే!

ఇటీవల కాలంలో ఆడ, మగా తేడా లేకుండా జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. కొందరు మగవారిలో బట్టతల కూడా వస్తోంది. మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారమే ఇందుకు కారణమవుతున్నాయి. జుట్టు రాలే సమస్య శాఖాహారుల్లోనే ఎక్కువగా ఉంటుందని తాజాగా వైద్యులు వెల్లడించారు. మాంసాహారులకు తగినంత లభిస్తున్న బీ12.. శాఖాహారులకు మాత్రం లభించడం లేదని చెబుతున్నారు.

శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఎందుకో తెలుసా? బట్టతలకు చెక్ పెట్టే విటమిన్ ఇదే!
Hair Loss
Rajashekher G
|

Updated on: Dec 27, 2025 | 4:37 PM

Share

నేటి కాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తీసుకునే ఆహారం, మారుతున్న జీవనశైలి కారణంగా ఆడ, మగ తేడా లేకుండా జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. మగవారిలో బట్టతల వస్తోంది. చాలా మంది జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు షాంపులను, నూనెలను మారుస్తుంటారు. కానీ, అవేం ఫలితం ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతారు.

తాజాగా వైద్యులు జుట్టు రాలడానికి మరో కారణానికి కొనుగొన్నారు. మాంసాహారుల కంటే శాఖాహారం తీసుకునేవారిలో జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు.

శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎందుకంటే?

జుట్టుకు అవసరమైన బీ12 విటమిన్ మాంసాహారం తీసుకునేవారికి పుష్కలంగా లభిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే, శాఖాహారులకు బీ12 పూర్తిస్థాయిలో లభించదు. దీని కారణంగా శాఖాహారుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటోంది. మీ జుట్టు ఒత్తుగా ఉండేందుకు బీ12 విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మాంసం లేదా చేపల నుంచి పొందే అమైనో ఆమ్లాలు శరీరం ప్రోటీన్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బీ12 విటమిన్‌ను అందిస్తాయి. శాఖాహారులు తమ ఆహారంలో తగినంత బీ12 పొందకపోవడంతో జుట్టు రాలే సమస్యను ఎదుర్కొవాల్సి వస్తోంది.

శాఖాహారులు ఏం చేయాలి?

శాఖాహారులైన వారు ఉదయం టీ లేదా కాఫీ లేదా స్మూతీ తాగేటప్పుడు పాలకు బదులుగా సోయా పాలు లేదా విటమిన్ బీ12 ఉన్న బాదంపాలు తీసుకోవచ్చు. విటమిన్ 12 ఉన్న రాగులు లేదా మిల్లెట్ ఫ్లేక్స్‌ను కూడా తీసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు, కురులకు శక్తినిచ్చేందుకు విటమిన్ బీ12 పుష్కలంగా ఉన్న సోయా పాలు, బాదంపాలు, ప్రోటీన్ ఈష్ట్, పచ్చి శనగ రొట్టె, సోయా ముక్కలు, టోఫును మీరు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి.

ఇంకా, గూస్ బెర్రీస్ ఆరోగ్యకరమైన జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనకారిగా భావిస్తారు. వీటిలో యాంటిఆక్సిటెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో విటమిన్ సి, ఐరన్ కూడా లభిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఇవి సహకరిస్తాయి. జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రతిరోజూ గూస్ బెర్రీస్ తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!