AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood: స్టార్ హీరోయిన్‏కు యాక్సిడెంట్.. పోలీస్ కారును ఢీకొట్టి.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

టాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె నడుపుతున్న స్కూటీ సమీపంలో ఆగి ఉన్న పోలీసు కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వాణి కపూర్ తెలుగులో నాని నటించిన ఆహా కళ్యాణం చిత్రంలో మెరిసింది. ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్.

Bollywood: స్టార్ హీరోయిన్‏కు యాక్సిడెంట్.. పోలీస్ కారును ఢీకొట్టి.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..
Vaani Kapoor
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2024 | 8:58 AM

Share

బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం జైపూర్‏లో ఓ సినిమా షూటింగ్‏లో ఆమెకు యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. పెర్కోటా జైపూర్‌లోని బాపూ బజార్‌లో వాణి కపూర్ వాకింగ్ చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో హీరోయిన్ నడుపుతున్న స్కూటీ సమీపంలో ఆగి ఉన్న పోలీసు కారును ఢీకొట్టింది. నివేదికల ప్రకారం, సినిమాలోని ఒక సన్నివేశంలో స్కూటీ రైడ్ సన్నివేశం ఉందని.. దీంతో హీరోయిన్ షూట్ కంటే ముందే స్కూటీ నడపడం ప్రాక్టీస్ చేస్తుందట. అదే సమయంలో ఆమె నడుపుతున్న స్కూటీ అక్కడే ఆగి ఉన్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే చిత్రయూనిట్ ఘటనా స్థలానికి చేరుకుని నటిని రక్షించారు. ఈ ప్రమాదంలో వాణికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం వాణి కపూర్ నటిస్తోన్న సినిమా ‘అబిర్ గులాల్’. ఈ చిత్రంలో పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఫవాద్ త్వరలో జైపూర్ రానున్నారు. నివేదికల ప్రకారం, నవంబర్ 18 న జైపూర్‌లోని శివ విలాస్ హోటల్‌లో సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇవి కూడా చదవండి

జైపూర్ ప్రాంతానికి వాణికి మంచి అనుబంధం ఉంది. ఆమె మొదటి సినిమా షూటింగ్ సైతం ఇక్కడే జరిగింది. ‘సుద్ధ్ దేశీ రొమాన్స్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పరిణీతి చోప్రా, వాణి కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వాణి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ వాణి కపూర్ నటించింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఆహా కళ్యాణం సినిమాలో కనిపించింది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us