AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 11 మందితో ఎఫైర్స్.. 24 ఏళ్ళకే తల్లి అయ్యింది.. ఇప్పటికీ ఒంటరిగానే.. ఈ హీరోయిన్ ఎవరంటే..

సినీ పరిశ్రమలోని స్టార్ సెలబ్రెటీల గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది. వారి వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్స్ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కెరీర్ మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు ఏకంగా 11 మంది ప్రేమలో పడిందట. కానీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయింది.

Tollywood: 11 మందితో ఎఫైర్స్.. 24 ఏళ్ళకే తల్లి అయ్యింది.. ఇప్పటికీ ఒంటరిగానే.. ఈ హీరోయిన్ ఎవరంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2024 | 8:24 AM

Share

సినీరంగుల ఆడంబరమైన ప్రపంచంలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ వ్యక్తిగత విషయాలతోనే ఎప్పుడూ వార్తలలో నిలిచారు. ప్రేమ, పెళ్లి, బ్రేకప్ ఇప్పుడు సెలబ్రెటీల లైఫ్ లో కామన్ అయిపోయింది. ప్రేమలో విఫలమయ్యాక.. కొత్త జీవితం ఆరంభించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది తారలు ఒంటరిగానే ఉండిపోయారు. హిందీలో ఎన్నో చిత్రాల్లో పవర్‌ఫుల్ పాత్రలు పోషించి తనదైన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె అందానికి ప్రపంచమే ఫిదా అయ్యింది. వెండితెరపై అగ్ర కథానాయికగా ఓ వెలుగింది. కానీ అప్పట్లో ఆమె పేరు ఎంతో మంది ప్రముఖులతో, వ్యాపారవేత్తలతో ముడిపడి ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11 మందితో ప్రేమలో పడిందంటూ అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఆమె జీవితంలో ఏ ఒక్క ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. 24 ఏళ్ల వయసులోనే తల్లి అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ సుష్మితా సేన్.

ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన సుష్మితా సేన్.. వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వార్తలలో నిలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ మాట్లాడుతూ.. ‘నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. మీరు జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా… ఆ నిర్ణయాలు బాధాకరంగా ఉంటాయి. కానీ జీవితంలో ప్రతి నిర్ణయం మనకు ఏదో నేర్పుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు సుష్మిత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్, వ్యాపారవేత్తలతో 11 మందితో సుష్మిత డేటింగ్ చేసినట్లుగా టాక్ నడిచింది. మోడల్ రోహ్మాన్ షాల్ తో ఈ హీరోయిన్ ఎక్కువగా కనిపించింది. ‘మిస్ యూనివర్స్’ టైటిల్‌ను గెలుచుకున్న సుస్మితా సేన్ వెండితెరపై అగ్రకథానాయికగా దూసుకుపోయింది. తాలి, ఆర్య వంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది. సుష్మిత ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ 24 ఏళ్ల వయసులోనే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆ తర్వాత మరో అమ్మాయిని దత్తత తీసుకుని ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటుంది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us