AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా అది.. 19 ఏళ్ల క్రితమే దుమ్మురేపింది.. ఇప్పటికీ ట్రెండింగ్‏లోనే..

దాదాపు 19 ఏళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.334 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema: ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా అది.. 19 ఏళ్ల క్రితమే దుమ్మురేపింది.. ఇప్పటికీ ట్రెండింగ్‏లోనే..
Apocalypto Movie
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2025 | 8:34 PM

Share

ప్రస్తుతం థియేటర్స్, ఓటీటీల్లోకి సరికొత్త జానర్ చిత్రాలు వస్తున్నాయి. హారర్, మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు అడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ జానర్ సినిమాలు రూపొందించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ? దాదాపు 19 సంవత్సరాల క్రితం వచ్చిన ఓ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. కేవలం రూ.334 కోట్లతో నిర్మించిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మాయన్ నాగరికత ఆధారంగా 2006లో వచ్చిన ఈ సినిమాకు మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో రికార్డ్స్ సృష్టించింది. ఈ చిత్రానికి ఇప్పుడు IMDBలో 7.8 రేటింగ్ ఉంది.

హృతిక్ రోషన్, పూజా హెగ్డే నటించిన ‘మొహెంజోదారో’ సినిమా గుర్తుందా.. ? చారిత్రక నాగరికత ఆధారంగా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. అలాంటి నాగరికత ఆధారంగా రూపొందించిన మరో సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. అదే ‘అపోకలిప్టో’. ఈ సినిమా క్రీ.పూ. 1517 నాటి మాయన్ నాగరికత ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా జాగ్వార్ పావ్ అనే గిరిజన వ్యక్తి, తెగల గురించి తెలియజేశారు. ఈ సినిమా కథ ఉత్తర అమెరికాలోని మాయన్ సంస్కృతి ఆధారంగా వచ్చింది. మెసోఅమెరికన్ అడవుల్లో నివసించే జాగ్వార్ పా అనే యువకుడు ఒక రోజు వేటకు వెళ్తాడు. అతను తన కుటుంబం, స్నేహితులతో కలిసి దొరికిన మాంసాన్ని తింటూ రాత్రి గడుపుతాడు.

గిరిజనులు వారిపై దాడి చేస్తారు. ప్రమాదాన్ని గ్రహించిన జాగ్వార్ పా తన భార్య, పిల్లలను భద్రత కోసం ఒక బావిలో దాచిపెడతాడు. అయితే దాడి చేసిన వారు వారిలో కొందరిని దారుణంగా చంపుతారు. జాగ్వార్ పాతో సహా మిగిలిన వారిని బానిసలుగా బంధించి బలి ఇవ్వడానికి తీసుకువెళతారు. ఈ దాడి వెనుక అసలు కారణం ఏమిటి? జాగ్వార్ పావ్ తన భార్య, పిల్లలను తిరిగి కలిశాడా? ఈ కష్టాల నుండి అతను ఎలా బయటపడ్డాడు? అనేది సినిమా. ఈ చిత్రం 3 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందాబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లోనూ చూడొచ్చు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్