Bangkok Pilla: భారీ భూకంపంతో రోడ్డున పడ్డ బ్యాంకాక్ పిల్ల.. వీడియో రిలీజ్ చేసిన తెలుగు యూట్యూబర్
గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా భూకంపాల వార్తలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారీ భూకంపాల కారణంగా మయన్మార్, బ్యాంకాక్, థాయిల్యాండ్ వంటి దేశాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. భవనాలు, నివాసాలు నేల మట్టం కావడంతో కోట్లాది మంది ప్రజులు రోడ్డున పడ్డారు.

భారీ భూకంపాల ధాటికి మయన్మార్, బ్యాంకాక్, థాయిల్యాండ్ దేశాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా నివాసాలు కోల్పోయి లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ఇప్పటికీ ఈ దేశాలు భూకంప తీవ్రత నుంచి కోలేకోలేకపోతున్నాయ. భారత్ తో సహా పలు దేశాలు భూకంప బాధితులకు ఆహారం తదితర నిత్యావసర సరుకులు అందజేస్తున్నాయి. కాగా ఈ భూకంపాల కారణంగా మయన్మార, బ్యాంకాక్, థాయిల్యాండ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. జీవనాధారం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో ప్రముఖ తెలుగు యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల ఫ్యామిలీ కూడా ప్రమాదంలో పడింది. ప్రస్తుతం తమ దీన స్థితిని తెలియజేస్తూ తమ యూట్యూబ్ ఛానెల్ లో వీడియోను రిలీజ్ చేసింది బ్యాంకాక్ పిల్ల అలియాస్ శ్రావణి వర్మ సామంత పూడి.
భర్త ఉద్యోగంలో భాగంగా బ్యాంకాక్ వెళ్లి అక్కడే స్థిర పడింది శ్రావణి. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ లోని ఓ ప్రముఖ ప్రాంతంలో నివాసం ఉంటుందామె. అయితే మొన్నటి భూకంప దాటికి… బ్యాంకాక్ పిల్ల కుటుంబం ఉంటున్న అపార్టమెంట్ కూడా నేల మట్టం అయ్యిందట. దీంతో అపార్ట్ మెంట్ లో ఉన్న జనాలందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బయటకు వచ్చారట. ఇక బ్యాంకాక్ పిల్ల కూడా చక చక అపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చి రోడ్డుపైకి వచ్చి ప్రాణాలు కాపాడుకుందట. ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్నామని, తమ కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది శ్రావణి. అదే సమయంలో ఈ భూకంప సమయంలో.. అక్కడ జరిగిన సన్నివేశాలను బ్యాంకాక్ పిల్ల షూట్ చేసి మరీ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. అనంతరం తమ దీన పరిస్థితులను వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది.
రోడ్డుపై బ్యాంకాక్ పిల్ల..
శ్రావణి బ్యాంకాక్ పిల్ల గా మారిపోయిందిలా..
కాగా ఏపీలోని ఓ ప్రాంతానికి చెందిన శ్రావణి తన భర్త ఉద్యోగంలో భాగంగా బ్యాంకాక్ కు వెళ్లి అక్కడే స్థిర పడిపోయింది. ఖాళీగా ఉండడం ఇష్టం లేక బ్యాంకాక్ లో ఉండే స్థితిగతులు, అక్కడి మార్కెట్, పర్యాటక ప్రదేశాలు, అక్కడి ప్రజల జీవన విధానంపై వీడియోలు చేస్తూ ఫేమస్ యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె యూట్యూబ్ ఛానెల్ కు సుమారు 20 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు బ్యాంకాక్ పిల్ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో. గతంలో ఆమె తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొంటుందని ప్రచారం జరిగింది. అయితే అవి కేవలం రూమర్లు గానే మిగిలిపోయాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.