కంటి చూపుతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న అంజలి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
అంజలి 1986 జూన్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలంలోని మొగలికుదురు గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం విదేశాల్లో ఉండేవారు కాబట్టి, ఆమె చిన్నతనంలో విదేశాల్లో చదువుకుంది. పదో తరగతి తర్వాత చెన్నైకి వచ్చి స్థిరపడింది. ఆమె మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

Anjali
- అంజలి 1986 జూన్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలంలోని మొగలికుదురు గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం విదేశాల్లో ఉండేవారు కాబట్టి, ఆమె చిన్నతనంలో విదేశాల్లో చదువుకుంది. పదో తరగతి తర్వాత చెన్నైకి వచ్చి స్థిరపడింది. ఆమె మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
- “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” , “బలుపు” , “గీతాంజలి” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా “సీతమ్మ వాకిట్లో…”లో సీత పాత్రలో ఆమె చేసిన అమాయకమైన నటన అందరి మనసులను గెలుచుకుంది.
- అంజలి సినీ రంగంలోకి 2006లో తెలుగు చిత్రం “ఫోటో”తో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2007లో తమిళ చిత్రం “కట్రదు తమిళ్”తో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
- ఇక ఇప్పుడు అంజలి హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు సహాయక పాత్రలు చేస్తుంది. చివరిగా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
- 2010లో “అంగడి తెరు”( తెలుగులో షాపింగ్ మాల్), 2011లో “ఎంగేయం ఎప్పోదుం” (తెలుగులో “జర్నీ”) చిత్రాల్లో ఆమె నటనకు రెండు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు (తమిళ ఉత్తమ నటి) అందుకుంది. “అంగడి తెరు”కు తమిళనాడు రాష్ట్ర అవార్డు కూడా గెలుచుకుంది.









