Vaishnavi Chaitanya: యువరాణి లుక్లో మరింత అందంగా వైష్ణవి చైతన్య.. ఫోటోస్ చూస్తే ఫిదా కావాల్సిందే..
ప్రస్తుతం సినీరంగంలో సత్తా చాటుతున్న తెలుగమ్మాయిలలో వైష్ణవి చైతన్య ఒకరు. బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు వరుసగా అగ్ర నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ వైరలవుతున్నాయి.
Updated on: Mar 30, 2025 | 7:10 PM

అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో చాలామంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా రాణించలేకపోయారు. అయితే కొంతమంది తెలుగు అమ్మాయిలు కష్టపడి పనిచేసి అవకాశాలు పొందడమే కాకుండా తక్కువ సమయంలో స్టార్స్ గా కూడా ఎదిగారు. అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్లలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి... అటు తర్వాత 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నారు.

'బేబీ' సినిమాలో వైష్ణవికి మెయిన్ హీరోయిన్ ఛాన్స్ వరించింది. 'బేబీ' లో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ సినిమా కథ మొత్తం హీరోయిన్ వైష్ణవి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆమె నటన సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ఆ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంలో వైష్ణవి పాత్ర ఎంతో ఉంది.

ఇప్పుడు ఆమె నటిస్తున్న 'జాక్' సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆమె ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైష్ణవి చైతన్యకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఏ ఫోటో షేర్ చేసినా ఇంటర్నెట్ షేక్ అవుతూ ఉంటుంది.

ఇప్పుడు కూడా ఆమె ఓ స్పెషల్ ఫోటో షూట్లో పాల్గొంది. ఇందులో ఆమె యువరాణిలా మెరిసిపోతూనే.. పవర్ఫుల్ గా కూడా కనిపిస్తున్నారు. భవిష్యత్తులో ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించే అవకాశాలు ఉన్నాయని ఈ ఫోటోలతో స్పష్టం చేసినట్టైంది.




