రెడ్ డ్రస్‌లో రెడ్ హాట్‌గా మెరిసిన వయ్యారి భామ.. పిచ్చెక్కిపోతోన్న కుర్రాళ్ళు
కేథరిన్ థ్రెసా.. ఈ అమ్మడి పూర్తి పేరు కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్. మోడల్ గా కేరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తుంది. ఈ బ్యూటీ 1989 సెప్టెంబర్ 10న దుబాయ్‌లో జన్మించింది. కేథరిన్ తన సినీ జీవితాన్ని 2010లో కన్నడ చిత్రం "శంకర్ IPS"తో ప్రారంభించింది,
Updated on: Mar 30, 2025 | 1:46 PM

కేథరిన్ థ్రెసా.. ఈ అమ్మడి పూర్తి పేరు కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్. మోడల్ గా కేరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తుంది. ఈ బ్యూటీ 1989 సెప్టెంబర్ 10న దుబాయ్‌లో జన్మించింది.

కేథరిన్ తన సినీ జీవితాన్ని 2010లో కన్నడ చిత్రం "శంకర్ IPS"తో ప్రారంభించింది, ఇందులో దునియా విజయ్ హీరోగా నటించాడు. అదే ఏడాది మలయాళ చిత్రం "ది థ్రిల్లర్"లో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన నటించింది. 2012లో కన్నడ చిత్రం "గాడ్‌ఫాదర్"లో ఉపేంద్రతో నటించి మంచి గుర్తింపు పొందింది.

తెలుగులో ఆమె తొలి చిత్రం 2013లో వచ్చిన "చమ్మక్ చల్లో", ఇందులో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. ఈ సినిమా విజయం సాధించకపోయినా, కేథరిన్ నటన, అందం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

ఆ తర్వాత తెలుగులో "పైసా" , "ఇద్దరమ్మాయిలతో", "సరైనోడు" , "బింబిసార"వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. తమిళంలో "మద్రాస్" (2014), "కనితన్" (2016) వంటి సినిమాల్లో కూడా ఆమె నటన ప్రశంసలు పొందింది.

కేథరిన్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన అభిమానులతో అందమైన ఫోటోలు మరియు అప్‌డేట్స్ పంచుకుంటుంది. ఆమె ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ, తన అందాన్ని కాపాడుకుంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని క్రేజీ పిక్స్ షేర్ చేసింది.





























