- Telugu News Photo Gallery Cinema photos Actress Eesha Rebba visits Tirumala with director Tarun Bhaskar photo gallary
శ్రీవారి సేవలో.. బంగారు చీరలో,బంగారంలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా!
అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తన గ్లామర్, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈనటి. తాజాగా ఈ అమ్మడు దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Mar 30, 2025 | 1:49 PM

తెలుగు బ్యూటీ, ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. వరంగల్‌లో జన్మించిన ఈ అమ్మడు, ఎంబీఏ చేసి మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో మెరిసి, అంతకు ముందు, ఆ తర్వాత అనే సినిమా ద్వారా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. అనుకుస్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఇక సినిమాలు లేకపోయినప్పటికీ ఈ అమ్మడుకు క్రేజ్ మాత్రం బానే ఉంటుంది.ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటిస్తుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది.

కానీ తాజాగా ఈ బ్యూటీ బంగారు రంగు చీరలో దర్శనం ఇచ్చి షాకిచ్చింది.ఈషా దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో కలిసి తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. అనంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రాలతో సత్కరించారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇందులో ఈషా రెబ్బా చాలా సాంప్రదాయం కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

బంగారు రంగు చీరలో సింపుల్ లుక్‌లో చూడటానికి చాలా అందంగా కనిపించింది. దీంతో బంగారు చీరలో బంగారంలో మెరిసిపోతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు ఫ్యాన్స్.



