OTT Movie: బాబోయ్.. 2 గంటలు నాన్ స్టాప్ థ్రిల్లింగ్.. ఊహించని ట్విస్టులు.. సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్కడ చూడొచ్చంటే..
మీరు థ్లిల్లర్ మూవీ లవర్స్ ఆ .. ? అనుక్షణం ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లోయింగ్ సీన్లతో సాగే ఈ మర్డర్ మిస్టరీని చూశారా.. ? ఇంట్లో కూర్చొని సస్పెన్స్ లేదా థ్రిల్లర్ చూడటానికి ఇష్టపడితే ఈ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా.. ?

ప్రస్తుతం ఓటీటీల్లో మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్ , రొమాంటిక్, కామెడీ జానర్ చిత్రాలు చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా అనేక కంటెంట్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒకటి. మర్డర్ మిస్టరీ, హారర్ థ్రిల్లర్ సినిమా… ఉత్కంఠభరితమైన సస్పెన్స్ ఉన్న సినిమా ఇది. ఒక జాలరి బీచ్‌లో చనిపోయిన వ్యక్తి పుర్రెను కనుగొనడంతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత కేసును రెండు వేర్వేరు కోణాల నుండి పరిశీలిస్తారు.
హంతకుడిని బయటపెట్టడానికి ఒక మహిళా జర్నలిస్ట్, ఒక పోలీసు అధికారి వేర్వేరు పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ సినిమా కథలోని మిస్టరీ, ఉత్కంఠ ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ తర్వాత ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠను మరింత పెంచుతాయి. 25 నుండి 30 సంవత్సరాల వయస్సు గల ఎవా మారియా అనే బాలిక హత్య ఎలా జరిగింది. దానిపై ఎలా దర్యాప్తు జరుగుతోంది. . ఈ దర్యాప్తు ప్రక్రియలో అనేక ఉత్కంఠభరితమైన దృశ్యాలు, రహస్యం ఉన్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు “కోల్డ్ కేస్”. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ ఆఫీసర్ సత్యజిత్ పాత్రను పోషించారు. అతనితో పాటు అదితి బాలన్ మహిళా జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తుంది. దక్షిణ నటి అథామియా రాజన్ ఎవా మారియా పాత్రను పోషించారు.
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని్ హిందీలో డబ్ చేసిన గోల్డ్ మైన ఛానెల్లో ఫ్రీగా చూడొచ్చు. ఈ చిత్రం 2021లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..