AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Anveshana: బెట్టింగ్ యాప్ సెలబ్రిటీల పేర్లతో వీడియోలు.. లక్షలు గడించిన అన్వేష్.. సంచలన ప్రకటన

ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ ఫేమ్ యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్ బాధితుల తరపున పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్న ఎందరో సెలబ్రిటీల పేర్లను బయట పెట్టాడు అన్వేష్. ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడీ గ్లోబల్ టూరిస్ట్.

Naa Anveshana: బెట్టింగ్ యాప్ సెలబ్రిటీల పేర్లతో వీడియోలు.. లక్షలు గడించిన అన్వేష్.. సంచలన ప్రకటన
Youtuber Anvesh
Basha Shek
|

Updated on: Mar 30, 2025 | 4:00 PM

Share

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ.. కొంతమంది సెలబ్రిటీలను, యూట్యూబర్ల పేర్లను బయట పెట్టాడు అన్వేష్. లోకల్ బాయ్ నాని మొదలు మొన్నటి నటుడు అలీ వరకు ఎంతో మంది సెలబ్రిటీల పేర్లను బయట పెడుతూ వరుసగా వీడియోలు రిలీజ్ చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే అన్వేష్ నిర్వహిస్తోన్న యూట్యూట్ ఛానెల్స్ కు కూడా 2.38 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అంటే తన వీడియోలకు కూడా మిలియన్ల వ్యూస్ వస్తాయి. అలాగే లక్షల ఆదాయం కూడా వస్తుంది. అందులోనూ ఈ మధ్యన అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల పేర్లను రివీల్ చేస్తూ వీడియోలు చేశాడు. దీంతో వీటికి ఇంకా భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఆదాయం కూడా బాగా వచ్చింది. దీంతో డబ్బుకి డబ్బు పేరుకి పేరు అన్నట్టుగా.. ఈ అన్వేష్ యాపారం ఏదో చాలా బాగుందిలే అన్న కామెంట్లూ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలపై అన్వేష్ వీడియోలు చేసి మిలియన్లలో వ్యూస్ సంపాదించి.. లక్షలు వెనకేసుకుంటన్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నా అన్వేషణ యూట్యబ్ ఛానెల్ కు 2.38 లక్షల మంది సబ్ స్క్రైబర్లు

ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లపై తాను చేస్తున్న వీడియోలకు వచ్చిన డబ్బుని తిరిగి ఎవరైతే బెట్టింగ్ యాప్‌ల వల్ల నష్టపోయారో వాళ్లకే ఇచ్చేస్తానని సంచలన ప్రకటన చేశాడు అన్వేష్. ఇప్పటివరకు ఈ వీడియోల ద్వారా తనకు రూ. 30 లక్షల ఆదాయం వచ్చిందని, మరో రూ. 30 లక్షలు రావాల్సి ఉందని, మొత్తం రూ.60 లక్షల రూపాయలను బెట్టింగ్ యాప్ బాధితుల కుటుంబాలకే అందిస్తానన్నాడు అన్వేష్.

మొత్తం రూ. 60 లక్షలు బెట్టింగ్ యాప్ బాధిత కుటుంబాలకే అందిస్తా..

‘ నేను కూడా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్‌లపై వీడియోలు చేస్తునే ఉన్నాను. ఇవి నేమ్ కోసమో ఫేమ్ కోసమో కాదు. వీటి ద్వారా ఇప్పటివరకూ నాకు రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. ఇంకో రూ. 30 లక్షలు వస్తుంది. అలా మొత్తం రూ. 60 లక్షలు తీసుకుని వెళ్లి.. ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల ఎవరైతే నష్టపోయారో.. చనిపోయారో వాళ్ల కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు అన్వేష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!