Hathya Movie: హత్య సినిమాలో మెరిసిన ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె భర్త పవర్ ఫుల్ విలన్
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సినిమా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దివంగత సీఎం సోదరుడు, మాజీ మంత్రి అయిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హత్యోదంతానికి ఈ సినిమా కథ దగ్గరగా ఉండడమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వరుసగా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి.

హత్య సినిమాలో ప్రముఖ నటి ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించింది. అలాగే సీనియర్ నటుడు రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, శివాజీ రాజా, బిందు చంద్రమౌళి, భరత్ రెడ్డి, రఘునాథ్ రాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ పొలిటికల్ మర్డర మిస్టరీ ఆధారంగా శ్రీవిద్య బసవ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఏపీలోని రాయల సీమకు చెందిన ఓ సీనియర్ రాజకీయ నాయకుడి హత్యకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఏడాది జనవరి 24న హత్య సినిమా థియేటర్లలో విడుదలకాగా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పేరు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తుండంతో ‘ ఇంతకీ ఏముందబ్బ ఈ మూవీలో’ అంటూ చాలా మంది ఓటీటీలో హత్య సినిమాను చూసేస్తున్నారు. ఈ మూవీలో నటించిన వారిలో చాలామంది తెలిసిన వారే. ధన్య బాలకృష్ణ, రవి వర్మ, శివాజీ రాజా, శ్రీకాంత్ అయ్యంగార్.. ఇలా అందరికీ తెలిసిన యాక్టర్లే ప్రధాన పాత్రలు పోషించారు. అయితే వీటితో పాటు ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ రోల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే షహీన్ అనే ముస్లిం మహిళ పాత్ర. ఈ సినిమాను చూసిన చాలామంది ఆమె ఎవరో మొదట గుర్తు పట్టలేకపోయారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు.
హత్య సినిమాలో షహీన్ పాత్రలో మెరిసింది మరెవరో కాదు పూజా రామచంద్రన్. ఇప్పటికీ గుర్తుకు రావడం లేదా? అయితే మీరు నిఖిల్ స్వామి రారా సినిమా చూశారా? అందులో కర్లీ హెయిర్ తో నిఖిల్ గ్యాంగ్ లో ఒక అమ్మాయి చూడ చక్కగా ఉంటుంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ తన మాయలో పడేస్తుంటుంది. ఆ అమ్మాయే ఈ షహీన్. గతంలో పిజ్జా, డి కంపెనీ, దోచెయ్, త్రిపుర, దళం, సిద్ధార్థ, ఇంతలో ఎన్నెన్ని వింతలో, వెంకీ మామా, కృష్ణార్జున యుద్ధం, పవర్ ప్లే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, రిపీట్, మై నేమ్ ఈజ్ శ్రుతి తదితర తెలుగు సినిమాల్లో పూజా రామ చంద్రన్ నటించింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లోనూ సందడి చేసిందీ అందాల తార.
భర్త, బిడ్డతో నటి పూజా రామచంద్రన్..
View this post on Instagram
ఇక పూజా రామచంద్రన్ భర్త మరెవరో కాదు. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే జాన్ కొక్కెన్. తీన్ మార్, అధినాయకుడు, దరువు, ఎవడు, నేనొక్కడినే, బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్, రాజా ది గ్రేట్, కేజీఎఫ్ ఛాప్టర్ 1,2, వెంకీ మామ, మహర్షి, వీర సింహారెడ్డి తదితర సినిమాల్లో నటించాడు జాన్ కొక్కెన్. వీరిది ప్రేమ వివాహం.
ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.