Prabhas: ప్రముఖ వ్యాపార వేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి! ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా
టాలీవుడ్ లో ది మోస్ట్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున గుర్తకు వచ్చే పేరు ప్రభాస్. ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ పెళ్లి వేడుకను చూడాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ పెళ్లిపై తరచూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.

ఆరడుగుల అందగాడు ప్రభాస్ పెళ్లిపై వార్తలు మళ్లీ గుప్పుమన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని గురువారం (మార్చి 27) ఉదయం కథనాలు వెలువడ్డాయి. ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటున్నారంటూ కొన్ని వెబ్ సైట్లు కథనాలు కూడా రాసేశాయి. సోషల్ మీడియాలోనూ ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల పోస్టులు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన చాలామంది ప్రభాస్ పెళ్లి వార్తలు నిజమేననుకున్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ప్రభాస్ పెళ్లి వార్తలపై అతని టీమ్ స్వయంగా స్పందించింది. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీంతో ప్రభాస్ పెళ్లి పుకార్లకు చెక్ పడినట్టైంది.
ప్రభాస్ పెళ్లిపై ఇలాంటి రూమర్లు రావడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ పలు సార్లు ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. పలానా హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని.. విజయవాడ అమ్మాయి అని.. గోదావరి రాజుల ఫ్యామిలీ అమ్మాయి అని.. ఇలా డార్లింగ్ పెళ్లిపై లెక్కలేనన్నీ గాసిప్పులు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి రూమరే రాగా ఎప్పటిలాగే ప్రభాస్ టీం వాటిని ఖండించింది. దీంతో ప్రభాస్ పెళ్లి చూద్దామనుకున్న అభిమానులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
కన్నప్ప సినిమాతో త్వరలోనే అభిమానుల ముందుకు ప్రభాస్..
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వం వహించే ‘స్పిరిట్’ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించనున్నాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలను కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు ప్రభాస్ ‘కన్నప్ప’ సినిమా తో తన అభిమానులను ఆశ్చర్యపరచబోతున్నాడు. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నాడు.
కన్నప్ప సినిమాలో రుద్రుడిగా ప్రభాస్..
ॐ The Mighty ‘Rudra’ ॐ
Unveiling Darling-Rebel Star 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 as ‘𝐑𝐮𝐝𝐫𝐚’ 🔱, a force of divine strength, wisdom, and protector in #Kannappa🏹. ✨
Embark on an extraordinary journey of devotion, sacrifice, and unwavering love.
Witness this epic saga on the big screen… pic.twitter.com/wcg7c3ulxd
— Kannappa The Movie (@kannappamovie) February 3, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.