Hyderabad: ‘నిలోఫర్ కేఫ్ విజయ గాథ స్ఫూర్తి దాయకం’.. హైటెక్ సిటీ ఔట్ లెట్ ప్రారంభ వేడుకలో సిద్ధు రెడ్డి కందకట్ల
తెలంగాణలో ప్రముఖ సామాజిక సేవకుడిగా పేరు తెచ్చుకున్న సిద్ధు రెడ్డి కందకట్ల ను హైదరాబాద్‌లోని కేఫ్ నిలోఫర్, హైటెక్ సిటీ కొత్త ఔట్‌లెట్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఆయన సామాజిక సేవకు గౌరవ సూచకంగా కేఫ్ వ్యవస్థాపకుడు బాబు రావు స్వయంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.

హైదరాబాద్‌లోని టెక్నాలజీ హబ్‌లో కొత్తగా తెరుచుకున్న భారతదేశంలో అతిపెద్ద టీ కేఫ్ అయిన కేఫ్ నిలోఫర్ ప్రారంభ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేఫ్ వ్యవస్థాపకుడు బాబు రావు మాట్లాడుతూ,.. సిద్ధు రెడ్డి కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, సమాజాన్ని మారుస్తున్న వ్యక్తి. విద్య, ఉపాధి, సామాజిక సేవలో ఆయన చేసిన కృషి నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది. అతని సేవా గుణానికి గౌరవం తెలియజేయడమే నా ఉద్దేశ్యం’ అని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఆహ్వానం తనకు గర్వకారణమని సిద్ధు రెడ్డి అన్నారు. ‘నిలోఫర్ కేఫ్ విజయగాథ నిజంగా ప్రేరణదాయకం. చిన్న స్థాయి నుంచి ఒక బ్రాండ్‌గా ఎదిగిన బాబు రావు గారి ప్రయాణం అద్భుతం. సమాజానికి కొంత చేస్తున్న నా కృషిని గుర్తించి నన్ను ఆహ్వానించడం, గౌరవించడం నాకు మరింత బాధ్యతను ఇస్తుంది’ అని ఆయన అన్నారు.
సమాజ సేవలో ముందుండే సిద్ధు రెడ్డి
సిద్ధు రెడ్డి కండకట్ల విద్య, సామాజిక సేవ, ఉపాధి కల్పనలో ప్రత్యేక దృష్టి సారిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2014లో శంషాబాద్ సమీపంలోని సిద్ధాంతి బస్తీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూసిన తర్వాత, విద్యారంగంలో మార్పు తేవాలని నిర్ణయించుకున్నారు. ఆ పాఠశాలను పునరుద్ధరించి, ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు, పాలమాకుల గ్రామంలో ‘కస్తూర్బా గాంధీ పాఠశాల’ అనే ప్రత్యేక బాలికల పాఠశాల స్థాపించారు. ప్రస్తుతం దేవాలయ శైలిలో ఓ ప్రత్యేక పాఠశాల నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, “విద్యా సంస్థలు కేవలం చదువుకునే ప్రదేశాలు మాత్రమే కాకుండా, పిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించే పవిత్రమైన స్థలాలుగా ఉండాలి” అని తెలిపారు. కేవలం విద్యే కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో సిద్ధు రెడ్డి పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.
హైదరాబాద్‌లో ఉద్యోగ మేళాలను నిర్వహించడం, దుబాయ్‌లో ప్రత్యేకంగా భారతీయ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు ఆటో రిక్షాలు అందజేయడం, వైకల్యం కలిగిన వారికి మొబిలిటీ స్కూటర్లు అందించడం వంటి పలు కార్యక్రమాల్లో సిద్దు రెడ్డి నడుం బిగించారు.
వృద్ధులకు ఇంటివాతావరణం – యువతకు ఉపాధి అవకాశాలు
సిద్ధు రెడ్డి నిజామాబాద్‌లో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్నారు, దాదాపు 40 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నదే తన ఆశయమని తెలిపారు. ‘మన పెద్దవారు సమాజానికి చేసిన సేవను మరచిపోకూడదు. వారి చివరి రోజులు ప్రశాంతంగా గడపాలన్నదే నా లక్ష్యం” అని అన్నారు.
అంతేకాదు, నూతన ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి సిద్ధు రెడ్డి పాటుపడుతున్నారు. హైదరాబాద్‌లో పలు జాబ్ మేళాలు నిర్వహించి వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా యువతకు ఉపాధి కల్పించేందుకు దుబాయ్‌లో ప్రత్యేకంగా ఉద్యోగ మేళా నిర్వహించారు.
సమాజ సేవకు గుర్తింపుగా గౌరవాలు

Siddu Reddy Kandakatla 1
సిద్ధు రెడ్డి కండకట్ల చేసిన సేవకు 2024లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రత్యేక గౌరవం అందించింది. లండన్‌లో ISR లీడర్ అవార్డును కూడా అందుకున్నారు. కేఫ్ నిలోఫర్ ప్రారంభోత్సవంలో సిద్ధు రెడ్డికి అందజేసిన గౌరవం, ఆయన సామాజిక సేవకు పెద్ద గుర్తింపుగా నిలిచింది. సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న సిద్ధు రెడ్డి చేసిన సేవల ద్వారా ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..