Hathya Movie OTT: ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపుతోన్న హత్య సినిమాలో ఏముంది? ఏ ఓటీటీలో చూడొచ్చు..
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హత్య సినిమా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాయలసీమలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హత్యోదంతం నేపథ్యంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడమే దీనికి కారణం. ఈ మూవీకి సంబంధించి వరుసగా పోలీస్ కేసులు నమోదువుతున్నాయి.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హత్య సినిమా ప్రకంపనలు రేపుతోంది. ఈ సినిమాలో తమ వ్యక్తిత్వాన్ని కించపరిచారంటూ పలువురు ప్రముఖులు పోలిస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై పోలీసులు కేసులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ‘హత్య’ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలపై కేసులు కూడా నమోదయ్యాయి. మరి ఇంతలా సంచలనం రేపుతోన్న ఈ హత్య సినిమాలో ఏముంది? ఎందుకిలా అందరూ పోలీస్ స్టేషన్లకు పరుగులు తీస్తున్నారో తెలుసుకుందాం రండి. శ్రీవిద్య బసవ తెరకెక్కించిన హత్య సినిమా ఓ సీనియర్ రాజకీయ నాయకుడి హత్య విచారణ చుట్టూ సాగుతుంది. ఆ పొలిటీషియన్‌ను ఎవరు హత్యచేశారనే విషయంపై ఓ సిన్సియర్ పోలీస్ అధికారి చేసే విచారణనే సినిమాలో చూపించారు. మూవీ ప్రారంభంలో ఈ సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు అని నిర్మాతలు.. డైరెక్టర్ డిస్‌క్లైమర్ వేసినా ఈ సినిమా ఇతివృత్థం ఏంటో చూసే వారికి ఈజీగా అర్థం అయిపోతుంది. ఎందుకంటే.. ఇది దివంగత సీఎం సోదరుడు, మాజీ మంత్రి హత్యోదంతానికి దగ్గరగా ఉంటుంది.
హత్య సినిమాలో ధన్య బాలకృష్ణ, రవి వర్మ, పూజా రామ చంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్, శివాజీ రాజా, బిందు చంద్రమౌళి, భరత్ రెడ్డి, రఘునాథ్ రాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది జనవరి 24న హత్య సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే అప్పుడు పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో ఈ సినిమాను చాలా మంది లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హత్య సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో చాలా మంది ఈ సినిమాను చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో హత్య సినిమాకు సంబంధించి పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం హత్య సినిమా అమెజాన్ ప్రైమ్‌లో టాప్-2గా ట్రెండ్ అవుతోండడం గమనార్హం. తెలుగుతో పాటు మరో ఐదు భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో హత్య స్ట్రీమింగ్..
#Hathya Based On YS Vivekananda Murder Mystery.
Movie Making Is Purely Based On Sudha Singh Investigation Within Any Political Influence
Very Engaging Perfect Casting Excellent Writing & Narration Screenplay 👌👌 Rating ⭐ 3.5/5
Kudos To @srividyabasawa@DhanyaBee pic.twitter.com/ZnuMd4Eei2
— Thandel Raju ⚓🌊❤️ (@PurnaMaaya_) March 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.