AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Trending: యాక్షన్, రొమాన్స్ కాదు భయ్యో.. ఈ సినిమా చూస్తే పొట్ట పగిలిపోతుంది.. ఓటీటీలో ట్రెండింగ్ మూవీ..

ఇప్పటివరకు యాక్షన్, హారర్, మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలో ఓటీటీలో దూసుకుపోతున్నాయి. కొన్నాళ్లుగా ఈ జానర్ సినిమాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు ఓ మూవీ మాత్రం ఓటీటీలో రచ్చ చేస్తుంది. ఈ సినిమా చూస్తే నవ్వలేక మీ పొట్ట పగిలిపోతుంది. ఈ సినిమా ఏంటో తెలుసా.. ? ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది.

OTT Trending: యాక్షన్, రొమాన్స్ కాదు భయ్యో.. ఈ సినిమా చూస్తే పొట్ట పగిలిపోతుంది.. ఓటీటీలో ట్రెండింగ్ మూవీ..
Ponman
Rajitha Chanti
|

Updated on: Mar 26, 2025 | 6:12 PM

Share

చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఒక చిత్రం ఈ ఏడాది విడుదలైంది. యాక్షన్, రొమాన్స్ కాదు.. కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ఇన్నాళ్లు సత్తా చాటిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఆ సినిమా పేరు ‘పోన్‌మ్యాన్’. ఇది మలయాళ బ్లాక్ కామెడీ చిత్రం. ఈ చిత్రం జి.ఆర్. ఇందుగోపన్ రాసిన నలంచు చెరుప్పక్కర్ నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే సజిన్ గోపు, లిజిమోల్ జోస్, దీపక్ పరాంబోల్, ఆనంద్ మన్మదన్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీకి ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు ఐఎమ్డీబీలో మంచి రేటింగ్ ఉంది.

కథ విషయానికి వస్తే..

ఇవి కూడా చదవండి

ఈ కథ ఒక నగల దుకాణంలో పనిచేసే అజేష్ (బాసిల్ జోసెఫ్) చుట్టూ తిరుగుతుంది. అజేష్ ఒక అమ్మాయి పెళ్లికి బంగారు నగలు ఇస్తాడు. కానీ డబ్బు తీసుకోడు.. ఆ పెళ్లికి వచ్చే అతిథులు ఇచ్చే కట్నాలు ఇవ్వమని ఒప్పందం చేసుకుంటాడు. అయితే ఆ అమ్మాయి పెళ్లికి అతిథిలు నుంచి వచ్చిన డబ్బు తక్కువగా ఉంటుంది. దీంతో తన నగలు తిరిగి ఇవ్వమని అజేష్ అమ్మాయి తల్లికి, సోదరుడికి చెబుతాడు. కానీ అప్పుడు ఒక పెద్ద సమస్య తలెత్తుతుంది. ఆభరణాలను లాక్కోవడానికి కుట్ర ప్రారంభమవుతుంది. ఆ అమ్మాయి నుండి నగలు తిరిగి తీసుకునే వరకు తాను వెళ్ళనని అజేష్ నిర్ణయించుకుంటాడు. కానీ ఆ అమ్మాయి భర్త సైతం ఆ నగల కోసమే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దీంతో సినిమా కథలో థ్రిల్ మరింత పెరుగుతుంది.

బాసిల్ జోసెఫ్ చిత్రం ‘పోన్మాన్’ కు జ్యోతిష్ శంకర్ దర్శకత్వం వహించారు. దీని కథ పూర్తిగా భిన్నంగా, తాజాగా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఈ మూవీ ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇక సినిమాలోని ప్రతి సీన్ మిమ్మల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ సినిమా చూడటం ప్రారంభించిన తర్వాత, చివరి వరకు ఆపాలని అనుకోరు. మరీ ఇంకెందుకు ఆలస్యం.. ఈ సినిమాను హాట్ స్టార్ ఓటీటీలో చూసేయ్యండి.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే