Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఇక్కడ తెలుగులోనూ చూడొచ్చు

ఈ మధ్యకాలంలో హాలీవుడ్ సినిమాలు కూడా తెలుగులో మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. అంతేకాదు తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు మన తెలుగు స్టార్ హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. అలా ఓ టాలీవుడ్ స్టార్ హీరో డబ్బింగ్ చెప్పిన ఓ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

OTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఇక్కడ తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 25, 2025 | 9:14 PM

కంటెంట్ బాగుంటే హలీవుడ్ సినిమాలకు కూడా మన దగ్గర మంచి కలెక్షన్లు వస్తాయి. గతంలో ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగలో డబ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఇక తెలుగులో మార్కెట్ ను పెంచుకునేందుకు, ఇక్కడి ఆడియెన్స్ కు మరింత చేరువ అయ్యేందుకు తమ సినిమాలకు ఏకంగా తెలుగు స్టార్ హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు హాలీవుడ్ మూవీ మేకర్స్. అలా రీసెంట్ గా రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టిన ముఫాసా ది లయన్ కింగ్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రఖ్యాత హాలీవుడ్‌ సంస్థ డిస్నీ నిర్మించిన ముఫాసా సినిమా గత ఏడాది డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ముఫాసా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజైంది. ఇక చిన్న,పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు. థియేటర్లలో భారీ కలెక్షన్లు ను రాబట్టిన ముఫాసా ది లయన్ కింగ్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. మార్చి 26 నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటన వెలువడింది. అంటే ఇవాళ్టి అర్ధా రాత్రి నుంచే ముఫాసా ఓటీటీలో సందడి చేయనున్నాడన్నమాట. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ ముఫాసా ది లయన్ కింగ్ సినిమాను తెరకెక్కించారు. గతంలో వచ్చిన లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా ముఫాసా సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో లయన్ కింగ్‌-2 కూడా వచ్చేసింది. ఇక సింబా కుమారుడిగా ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఇక హిందీ వెర్షన్ లో ఈ సినిమాకు షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో టాకా పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఇవ్వడం విశేషం. మరి ఇన్ని విశేషాలున్న ముఫాసా ది లయన్ కింగ్ సినిమాను థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..