Sonia Singh: ఖరీదైన బెంజ్ కారు కొన్న సోనియా సింగ్.. ప్రియుడితో కలిసి ఫస్ట్ డ్రైవ్.. వీడియో ఇదిగో..
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా సింగ్ ఒకరు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్, రియాలిటీ షోస్ తో బిజి బిజీగా ఉంటోందీ అందాల తార. తాజాగా సోనియా సింగ్ తన ప్రియుడితో కలిసి కొత్త కారు కొనుగోలు చేసింది.

సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది సోనియా సింగ్. అందులో అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈ అమ్మడి అభినయం అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సోనియా సింగ్ షార్ట్ ఫిల్మ్స్ తో నెట్టింట మంచి పాపులారిటీ తెచ్చుకుంది. పవన్ సిద్ధు అనే కుర్రాడితో కలిసి ‘రౌడీ బేబీ’, ‘హే పిల్ల’ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆమె చేసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది. ఈ కారణంగానే పలు సీరియల్స్ లోనూ, టీవీ షోస్ లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఇదే క్రమంలో 2023లో ‘విరూపాక్ష’ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం సొంతం చేసుకుంది. ఇక నితిన్, శ్రీలీల ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ లోనూ ఓ కామెడీ రోల్ తో ఆకట్టకుందీ అందాల తార. అలాగే పవన్ సిద్దూతో కలిసి శశి మథనం అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఢీ షోలో యాంకర్ గా చేస్తోంది. ఇలా ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో చేజేతులా సంపాదిస్తోంది సోనియా సింగ్. ఈ క్రమంలోనే మెర్సిడెజ్ బెంజ్ సీ క్లాస్ కారుని కొనుగోలు చేసింది.తన కుటుంబ సభ్యులు, ప్రియుడు తో కలిసి షోరూమ్ కు వచ్చిన ఆమె తన డ్రీమ్ కారుని తీసుకుంది.
ఈ సందర్భంగా అక్కడే తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్ధు, తన ఫ్యామిలీతో కలిసి కేట్ కట్ చేసి సంబరాలు చేసుకుంది సోనియా. అనంతరం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారులో సిద్ధుతో ఫస్ట్ డ్రైవ్ కి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనియా సింగ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కొత్త కారుతో సోనియా సింగ్, వీడియో..
View this post on Instagram
కాగా హైదరాబాద్ లో మెర్సిడెస్ బెంజ్ కార్ రేటు సుమారు రూ.60-80 లక్షలకు పైగానే ఉందని తెలుస్తోంది. అంత ఖరీదైన కారుని కొనుగోలు చేసిందంటే సోనియా రేంజ్ బాగానే పెరిగిందని నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కొత్త కారుకు పూజలు చేస్తోన్న సోనియా సింగ్.. ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.