- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan hari hara veeramallu relatesing date latest update on 24 03 2025
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్.. ఇక ఊపిరి పీల్చుకోండి.. ఇట్స్ అఫీషియల్
ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. చాలాసార్లు డేట్ కూడా మారింది.. అందుకే ఈసారి కచ్చితంగా చెప్పిన తేదీకి చెప్పినట్లుగానే వస్తానంటున్నారు పవర్ స్టార్. హరిహర వీరమల్లు విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. మీరు మీ పని చేసుకోండి.. నేను చేయాల్సింది నేను చేస్తానంటూ మేకర్స్‌కు మాటిస్తున్నారు. మరి పవన్ ఏం చెప్పారు..? వీరమల్లు టీం ఏం చేస్తున్నారు చూద్దామా..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 24, 2025 | 9:15 PM

చూస్తుంటే ఈసారి హరిహర వీరమల్లు సినిమాకు పక్కాగా మోక్షం లభించేలాగే కనిపిస్తుంది. అప్పుడెప్పుడో కరోనా సమయంలో మొదలుపెట్టిన ఈ సినిమా.. నాలుగేళ్లుగా అండర్ ప్రొడక్షన్‌లోనే ఉంది. చివరికి మే 9న విడుదల తేదీ కన్ఫర్మ్ చేసుకుంది.

అప్పటికైనా వస్తుందా అంటూ అభిమానులు అనుమానిస్తున్నా.. మేకర్స్ మాత్రం ఈసారి ఆన్ టైమ్ పక్కా అంటున్నారు. 4 రోజులు మినహా.. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తైపోయింది. నేడోరేపో పవన్ ఈ కాస్త పూర్తి చేయాలని చూస్తున్నారు.

ఆయన వచ్చేలోపే పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. తాజాగా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసారు. అందుకే మార్క్ ది డేట్ అంటూ మరోసారి ట్వీట్ చేసారు వీరమల్లు టీం. ముందు మార్చి 28 అనుకున్నా.. చివరి నిమిషంలో మరోసారి వాయిదా తప్పలేదు.

మే 9 అంటే 50 రోజుల సమయం ఉంది. అందులో పవన్ ఒక్క 10 రోజులు ఈ సినిమాపై కాన్సట్రేషన్ చేసినా చాలు.. వీరమల్లు పనైపోతుంది. ఆ నమ్మకంతోనే అనుకున్న తేదీకి వస్తామంటున్నారు మేకర్స్. పవన్ కూడా ఈ సినిమా నుంచి ఫ్రీ అవ్వాలని చూస్తున్నారు.

ప్రమోషన్ మాత్రం పవన్ కళ్యాణ్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం పవన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా ఇది హరిహర వీరమల్లు పార్ట్ 1 మాత్రమే.. పవన్ ఇప్పుడున్న బిజీకి రెండో పార్ట్ ఇప్పట్లో రావడమైతే కష్టమే.





























