- Telugu News Photo Gallery Cinema photos Upcoming movies like toxic RC16 The Paradise March 2026 Releasing dates
3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
ముందుచూపు మంచిదే..! కానీ మరీ ఏడాది ముందే రిలీజ్ డేట్ లాక్ చేసుకునేంత ముందు చూపు మంచిదేనా అని డౌట్ ఇప్పుడు..? మరీ ముఖ్యంగా 2026 మార్చి నెలను చూస్తుంటే భయమేస్తుందిప్పుడు బయ్యర్లకు. దానికి కారణం 3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్..! మరింతకీ మార్చి 2026లో రాబోయే ఆ సినిమాలేంటి..?
Updated on: Mar 24, 2025 | 8:45 PM

2026 మార్చి 26.. ఈ డేట్ ముందుగా లాక్ చేసుకున్నది నాని. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఈయన చేస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్. ఈ మధ్యే టైటిల్ టీజర్ విడుదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.

ఒక్కసారి షూట్ స్టార్ట్ అయితే.. పూర్తయ్యేవరకు నో బ్రేక్స్. ఇక నాని వస్తున్న ఆ రోజే.. రామ్ చరణ్ కూడా రావాలని చూస్తున్నారు. బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేస్తున్న సినిమా రిలీజ్ డేట్ సైతం మార్చి 26, 2026 అని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాల బిజినెస్ దాదాపు 700 కోట్ల పైమాటే. పైగా ఇటు రామ్ చరణ్‌కు రంగస్థలం, ట్రిపుల్ ఆర్ మార్చిలోనే విడుదలై సంచలనం సృష్టించాయి.. మరోవైపు నాని కెరీర్‌ను మార్చేసిన దసరా వచ్చింది కూడా మార్చిలోనే.

తాజాగా టాక్సిక్ కూడా మార్చిలోనే రానుంది. యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ లాక్ చేసారు మేకర్స్. మార్చి 19, 2026న విడుదల కానుంది ఈ సినిమా.

అంటే చరణ్, నాని కంటే ఒక వారం ముందొస్తున్నారు రాకింగ్ స్టార్. ఈ సినిమా బిజినెస్ 400 కోట్లకు పైగానే జరుగుతుంది. మొత్తానికి 2026 మార్చి ప్యాన్ ఇండియన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది.




