Tollywood: ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పొలిటికల్ లీడర్ కూడా..
ఈ అమ్మాయి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో అరంగేట్రం చేసింది. అలాగే న్యాచురల్ స్టార్ నాని తో కలిసి ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో యాక్ట్ చేసింది. తెలుగుతో పాటు తమిళంలో విశాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

పై ఫొటోలో ఉన్న హైస్కూల్ అమ్మాయిని గుర్తు పట్టరా? తను ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కెరీర్ ప్రారంభంలోనే మహేష్ బాబు, నాని వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టింది. అందం, అభినయం పరంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ హీరోయిన్ గా లాంగ్ కెరీర్ కొనసాగించలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినా విజయం మాత్రం దక్కలేదు. తెలుగుతో పాటు తమిళ్ లో సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం దరిచేరలేదు. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైంది. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడేతత్వమున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రాజకీయాల్లో బిజి బిజీగా ఉంటోంది. బీజేపీ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. అయితే అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. కానీ అవసరమైనప్పుడల్లా తన వాయిస్ వినిపిస్తూనే ఉంది. ఆ మధ్యన రాయలసీమకు చెందిన ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ ఈ నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె కూడా సై అంటే సై అంటూ ఆయనకు ఎదురు తిరిగి వార్తల్లో నిలిచింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. తను మరెవరో కాదు తరచూ సోషల్ మీడియా వేదికగా సామాజిక సమస్యలు, అంశాలపై తనదైన శైలిలో స్పందించే మాధవీలత.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే మాధవీలత ఇటీవల ఈ ఫొటోను షేర్ చేసింది. దీనికి నేను హైస్కూల్ అమ్మాయిని అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది మాధవీలత. ఇదే ఆమెకు మొదటి సినిమా. ఆ తర్వాత రవి బాబు దర్శకత్వంలో ఆమె నటించిన నచ్చావులే సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో మాధవీలత అభినయం కూడా అందరీనీ ఆకట్టుకుంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో కలిసి స్నేహితుడా ప్రేమ కథా చిత్రంలో నటించింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిందీ అందాల తార.
మాధవీలత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి