Megastar Chiranjeevi- Silk Smitha: సిల్క్ స్మిత కోసం ఆ హీరోయినే పక్కన పెట్టిన చిరంజీవి.. చివరకు..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్ సొంతం చేసుకుంది సిల్క్ స్మిత. 80,90లలో తెలుగు సినీరంగంలో ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అప్పట్లో అగ్రతారలకు మించిన పారితోషికం..ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

తెలుగు సినీప్రియులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 80,90లలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకున్న అందాల తార. అప్పట్లో అగ్ర హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంది. ఎన్నోసినిమాల్లో స్పెషల్ సాంగ్స్, కీలకపాత్రలు పోషించి ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మత్తెక్కించే నిషా కళ్లు.. చూడచక్కని రూపం.. అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాలో కచ్చితంగా సిల్క్ స్మిత సాంగ్ ఉండాల్సిందే అన్న స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో సిల్క్ స్మిత కాల్ షీట్ దొరకడం కూడా కష్టమయ్యేది. ఇదిలా ఉంటే.. సిల్క్ స్మితతో షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి సైతం వెయిట్ చేశారట.
చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఛాలెంజ్ సూపర్ హిట్ చిత్రం. ఈ సినిమాలో సుహాసిని, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. ఇందులో సిల్క్ స్మిత కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషఇంచింది. దర్శకుడు కోదండ రామి రెడ్డి చిరంజీవి, సిల్క్ స్మిత సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేశాడట. కానీ సిల్క్ స్మిత బిజీగా ఉండడం వల్ల ఆరోజు షూటింగ్ కు రాలేకపోయిందట. కొన్ని రోజుల తర్వాత సిల్క్ స్మిత ఆకస్మాత్తుగా తాను షూటింగ్ కు వస్తున్నట్లు నిర్మాతలకు తెలియజేసిందట.
అప్పటికే చిరంజీవి, సుహాసిని మాధ్య సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేసింది చిత్రయూనిట్. దీంతో ర్మాతలకు ఏమి చేయాలో అర్థం కాలేదు. చిరంజీవితో చర్చించిన తర్వాత, సుహాసిని సన్నివేశాలను రద్దు చేశారు. ఆ రోజు షూట్ కి రావద్దని సుహాసినికి చెప్పారట. ఆ తర్వాత చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారట. ఆ తర్వాత కూడా సుహాసిని షూటింగ్ కు రాలేదట. కానీ కొన్నాళ్లకు మళ్లీ సుహాసిని సెట్ లో అడుగుపెట్టిందట.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..