AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiraack Boys Khiladi Girls 2: 16 మంది సెలబ్రిటీలతో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2..టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరించిన సక్సెస్‌ఫుల్ టీవీ రియాలిటీ షో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2 కు రంగం సిద్ధమైంది. మొదటి సీజన్ కు మించి ఈసారి ఏకంగా 16 మంది సెలబ్రిటీలతో ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది.

Kiraack Boys Khiladi Girls 2: 16 మంది సెలబ్రిటీలతో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2..టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే
Kiraak Boys Khiladi Girls 2
Basha Shek
|

Updated on: Mar 27, 2025 | 5:49 PM

Share

పదహారు మంది సెలెబ్రిటీలు.. ఇద్దరు స్టార్ లీడర్స్.. ఒక ఎనర్జిటిక్ ప్రేజెంటర్.. ఒక సక్సెస్ ఫుల్ ఫార్మాట్.. గెలవాలనే పట్టుదల.. ఓటమి ని గెలుపుగా మలుచుకోవాలనే తపన.. ఒకే వేదికపైన ప్రేక్షకులకు వినోదం అందించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తే.. ? ఆ వేదిక పేరు, ఆ వేడుక పేరు “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”. ఇది స్టార్ మా అందించబోతున్న సరికొత్త షో. కిరాక్ బాయ్స్, కిలాడి గాళ్స్ హోరా హోరీగా పోటా పోటీగా తలపడబోతున్నారు. ఇది – అమ్మాయిలకీ అబ్బాయిలకీ మధ్య ఇంటరెస్టింగ్ వైల్డ్ ఫైర్.. తగ్గేదేలే అని పోటీ పడుతున్న టీమ్స్ తో కొత్త వార్ “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్” సీజన్ 2. !!

సినిమా, టీవీ రంగాల్లో తమదైన ముద్ర వేసిన సెలెబ్రిటీలు ఈ షో లో రెండు టీమ్స్ గా ఓ ఆట ఆడబోతున్నారు. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఛాలెంజెస్ తో ఒకరిని మించి మరొకరు సత్తా చూపించడానికి రెడీ ఆవుతున్నారు. గెలుపు కోసం ఎత్తులు, పై ఎత్తులతో ప్రేక్షకులను అలరించడానికి అన్ని అస్త్రాలు సమకూర్చుకుంటున్నారు. ఈ షో లో పాల్గొంటున్న ప్రతి కంటెస్టెంట్ ఒక్కో స్పెషల్ టాలెంట్ తో ఈ షో కి వస్తున్నారు. “ఎప్పటికీ.. నో కాంప్రమైజ్ ” అనే యాటిట్యూడ్ తో ప్రతిఒక్కరు ఎదురు టీం తో తలపడబోతున్నారు.

స్మాల్ స్క్రీన్ సంచలనం శ్రీముఖి ఎనర్జిటిక్ గా ఈ రెండు టీముల సమరాన్ని నడిపించబోతున్నారు. ఆర్టిస్టులను, సెలబ్రిటీ లను డీల్ చేయడంలో ఎంతో అద్భుతమైన సమయస్ఫూర్తి తో వ్యవహరించే శ్రీముఖి 16 మంది కంటెస్టెంట్స్ ని, ఇద్దరు లీడర్స్ ని బాలన్స్ చేయబోతున్నారు. ఈ షో లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ “కిరాక్ బాయ్స్” తరఫున లీడ్ చేయబోతున్నారు. ప్రెజెంటర్ గా, నటిగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న అనసూయ “కిలాడి గాళ్స్”కి ప్రతినిధిగా వుంటున్నారు. ఒకసారి గెలిచిన ఆనందంలో, దాన్ని ఈ సారి కూడా రిపీట్ చేద్దాం అనుకుంటున్న “కిరాక్ బాయ్స్”, ఫస్ట్ సీజన్ ఓడిపోయిన అవమానంతో ఈ సీజన్ ఎలాగైనా కొట్టాలి అనే పట్టుదలతో రగిలిపోతున్న “కిలాడి గాళ్స్” మధ్య పోటీ చాలా చాలా ఇంటరెస్టింగ్ గా వుండబోతోంది.

ఇవి కూడా చదవండి

కిరాక్ బాయ్స్ గా ఈ షో లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు – మానస్, కాస్కో నిఖిల్, బంచిక్ బబ్లూ, పృథ్వి, శివ్, ఇమ్మాన్యుయేల్, దిలీప్, సాకేత్. కిలాడి గాళ్స్ గా పోటీ పడబోతున్నవారు – హమీదా, రోహిణి, తేజస్విని మడివాడ, సుష్మిత, లాస్య, శ్రీ సత్య, దేబ్ జానీ, ఐశ్వర్య. 16 మంది సెలబ్రిటీ లు ఒకే వేదికపై చేయబోతున్న సందడి, సంబరం తో ఈ షో మార్చి 29 న ప్రారంభం అవుతుంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన