Rashmika Mandanna: ‘రోజూ మూడు షిఫ్టులు.. జ్వరం వచ్చినా షూటింగ్‌కు’.. రష్మికను తెగ పొగిడేసిన సల్మాన్ ఖాన్
పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. ఇప్పటికే పుష్ప 2, ఛావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ అందాల తార ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ సినిమాలో నటిస్తోంది. అయితే ఎవరినీ ఎప్పుడూ ప్రశంసించని సల్మాన్ ఖాన్ రష్మికను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు.

రష్మిక మందన్నా ఇప్పుడు గోల్డెన్ లెగ్. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లోనూ వరుసగా విజయాలు దక్కించుకుంటోందీ అందాల తార. ఇప్పటికే దక్షిణాది చిత్ర పరిశ్రమలో నంబర్ 1 నటిగా వెలుగొందిన నటి రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ లోనూ నంబర్ 1 నటిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ నటులతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘సికందర్’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది, రంజాన్ పండగల కానుకగా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సల్మాన్ రష్మిక గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ముఖ్యంగా ఎప్పుడూ హీరోయిన్లను ప్రశంసించని సల్మాన్ ఖాన్, రష్మికను మాత్రం తెగ పొగిడేశాడు.
ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సికందర్ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఒక ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. అందులో ముగ్గురూ కూర్చుని సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమిర్ ఖాన్ సికిందర్ సినిమాలో లో హీరోయిన్ ఎవరు? అని అడిగాడు. అప్పుడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘రష్మిక మందన్న హీరోయిన్ అని, ఆమె చాలా ప్రభావవంతమైన, కష్టపడి పనిచేసే నటి’ అని కొనియాడాడు.
సల్మాన్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ, “రష్మిక మందన్న అద్భుతమైన నటి. మేము హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు, ఆమె ఉదయం ఆరు గంటలకు రెడీ అయి ‘పుష్ప 2′ సినిమా షూటింగ్‌లో పాల్గొనేది. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, మాతో పాటు షూటింగ్‌కు వచ్చేది. ఆమెకు జ్వరం వచ్చినప్పుడు కూడా, ఆ నటి విశ్రాంతి లేకుండా పనిచేసింది. ఆమెను చూడగానే నాకు నా పాత రోజులు గుర్తుకు వచ్చాయి. 20-25 సంవత్సరాల క్రితం, ఆమిర్ ఖాన్, నేను, ఇంకా చాలా మంది ఇలా రెండు లేదా మూడు షిఫ్టులలో పనిచేసేవాళ్ళం. రష్మిక ఇప్పుడు రోజుకు రెండు లేదా మూడు షిఫ్టులలో పనిచేస్తోంది’ అని సల్మాన్ ఖాన్ చెప్పు కొచ్చాడు.
మార్చి 30న విడుదల కానున్న ‘సికందర్’ చిత్రంలో రష్మిక, సల్మాన్ ఖాన్ కలిసి కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి.
సికందర్ ప్రమోషన్లలో సల్మాన్, ఆమిర్ ఖాన్..
Full Video Out Now! #SikandarMeetsGhajini https://t.co/aNe2jmVm8T
#AamirKhan #SajidNadiadwala’s #Sikandar Directed by @ARMurugadoss @NGEMovies @SKFilmsOfficial @ZeeMusicCompany @PenMovies @WardaNadiadwala #SikandarEid2025
Sikandar In Cinemas from 30th March pic.twitter.com/TLgFx5OUsI
— Salman Khan (@BeingSalmanKhan) March 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.