Tollywood: సొంతంగా విమానాల బిజినెస్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో.. హార్స్ రైడింగ్ క్లబ్ ఉన్న స్టార్ అతడే..
ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ హీరోలలో అతడు ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో.. ఇటు సినిమాల్లోనే కాదు.. అటు వ్యాపారరంగంలోనూ సత్తా చాటుతున్నాడు. హార్స్ రైడింగ్ క్లబ్ తోపాటు సొంతంగా విమానాల బిజినెస్ ఉన్న ఏకైక స్టార్ హీరో. ఇంతకీ అతడు ఎవరంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అతడి సినిమాల కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ స్టార్ హీరో… అటు వ్యాపారరంగంలోనూ సక్సెస్ అయ్యాడు. సొంతంగా విమానాల బిజినెస్.. అలాగే నిర్మాణ సంస్థలతోపాటు హార్స్ రైడింగ్ క్లబ్, రన్నింగ్ ఛాలెంజ్ సర్వీస్ సైతం ఉన్నాయి. ఇక ది ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.1370 కోట్లు ఉంటుందని సమాచారం. వ్యాపారరంగాలలో స్మార్ట్ పెట్టుబడులు పెట్టడం ద్వారా బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ అయ్యారు. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా.. ? అతడి కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు.అతడు మరెవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈరోజు (మార్చి 27న) చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, సెలబ్రెటీస్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు. ఇటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. అటు వ్యాపారరంగంలోనూ చాలా యాక్టివ్ అన్న సంగతి మీకు తెలుసా.. ? చరణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. రామ్ చరణ్ 2016లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ పై ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత 2023లో, రామ్ చరణ్ UV క్రియేషన్స్ విక్రమ్ రెడ్డితో కలిసి V మెగా పిక్చర్స్ అనే మరో నిర్మాణ సంస్థను స్థాపించారు.
పోలో జట్టు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే ముందు , రామ్ చరణ్ 2011లో హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ అనే తన సొంత పోలో జట్టును ప్రారంభించాడు. చిన్నప్పటి నుంచి చరణ్ కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం.
ట్రూజెట్ 2013లో, రామ్ చరణ్, వంకాయలపాటి ఉమేష్ హైదరాబాద్‌లో ఉన్న ప్రాంతీయ విమానయాన సంస్థ అయిన టర్బో మేఘ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు . రెండు సంవత్సరాల తర్వాత దానిని ఎయిర్‌లైన్ పేరును ట్రూజెట్‌గా మార్చారు. అయితే, ఫిబ్రవరి 2022లో ప్రాంతీయ విమానయాన సంస్థ కార్యకలాపాలను నిలిపివేసింది.
ఇతర వ్యాపారం.. రామ్ చరణ్ డెవిల్స్ సర్క్యూట్ అనే అడ్డంకి రన్నింగ్ సిరీస్‌కు కూడా సహ-యజమాని. 2017లో ఉపాసన కామినేని కూడా ఛాలెంజింగ్ కోర్సులో పాల్గొని తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్లాగ్‌ను షేర్ చేసింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..