OTT Movie: పుట్టిన రోజు చేసుకునేవాళ్లే ఈ సైకో కిల్లర్ టార్గెట్.. ఓటీటీలో ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్‌ను చూశారా?
ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఇంటెన్స్ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలను ఆసక్తికరంగా తీయడంలో మలయాళ దర్శకులు ఒక అడుగు ముందే ఉంటారు. అందుకే మాలీవుడ్ సినిమాలకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా ఓటీటీలో ఇప్పుడు మలయాళ సినిమాలదే హవా అని చెప్పుకోవచ్చు.

కిష్కింద కాండం, రేఖా చిత్రం, సూక్ష్మ దర్శిని, లేటెస్ట్ గా ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. ఇలా ఇటీవల ఓటీటీలో విడుదలైన మలయాళ సినిమాలన్నంటికీ మంచి స్పందన వచ్చింది. తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాలను బాగా ఆదరించారు. ఇప్పుడే కాదు గత కొన్నేళ్లుగా మాలీవుడ్ నుంచి ఇలాంటి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఓటీటీలో మన తెలుగు ఆడియెన్స్ మెప్పు పొందుతూనే ఉన్నాయి. అందులో అబ్రహం ఓజ్లర్ కూడా ఒకటి. ఇందులో అల వైకుంఠపురం మూవీ ఫేమ్ జయరాం మెయిన్ రోల్ పోషిస్తే, స్టార్ నటుడు మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నటించడం విశేషం. గతేడాది థియటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏకంగా రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒక అనుభవజ్ఞుడైన పోలీసు అధికారి అయిన అబ్రహం ఓజ్లర్, ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
ఈ సినిమాలో ఒక ఐటీ ఉద్యోగి తన పుట్టిన రోజునే దారుణంగా హత్య కు గురవుతాడు. ఒక సైకో కిల్లర్ ఈ హత్య చేసినట్లు తెలుస్తుంది. అలాగే చాలామంది సైకో కిల్లర్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో అతనికి బర్త్ డే కిల్లర్ అని పిలుస్తారు ఎందుకంటే అతను బాధితులను వారి పుట్టినరోజున హత్య చేసి, కొన్ని గుర్తులను కూడా వదిలి వెళతాడు. మరి ఈ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకీ హత్యలు చేస్తున్నాడు? అబ్రహం ఓజ్లర్ ఆ సైకో కిల్లర్ ను పట్టుకున్నాడా?లేదా? తెలియాలటే ఈ మూవీని చూడాల్సిందే
40 కోట్లకు పైగా కలెక్షన్లు..
Greatest Comeback Of All Time 🔥⚡
Abraham Ozler Crossed 40 Cr + Ww Collection 💥
Running Successfully In Theaters….. ⚡
Design By @BinoyBmDesigns#Jayaram #Mammootty #Midhunmanuelthomas #Abrahamozler pic.twitter.com/AC7UAXYsdk
— ᴊᴀʏᴀʀᴀᴍ ꜰᴀɴꜱ & ᴇᴅɪᴛᴏʀꜱ ᴄʟᴜʙ (@team_jfec) February 7, 2024
ప్రస్తుతం అబ్రహం ఓజ్లర్ మూవీ జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
1 year of #abrahamozler The theater turned into stadium mode during this scene.🥶🥵🔥
Without knowing how he looks in the movie, the anticipation for this film is incredibly high.#Mammootty @MKampanyOffl #Rekhachithram pic.twitter.com/uhDSdWEcqA
— Indrajith (@Indrajith_369) January 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








