Actress Sanghavi: నటి సంఘవి ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
అలనాటి స్టార్ హీరోయిన్ సంఘవి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే అప్పుడప్పుడు టీవీ షోల్లోనూ, ఫంక్షన్లలోనూ తళుక్కుమంటోందీ అందాల తార

దక్షిణాది సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన అందాల తారల్లో సంఘవి కూడా ఒకరు. కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ లోనూ సినిమాలు చేసిందీ ముద్దుగుమ్మ. తన పదిహేనేళ్ల సినిమా కెరీర్ లో సుమారు 80 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. 1993లో కొక్కరొకో అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంఘవి. ఆ తర్వాత తాజ్ మహల్, ఊరికి మొనగాడు, తాత మనవడు, నాయుడు గారి కుటుంబం, సరదా బుల్లోడు, అబ్బాయి గారి పెళ్లి, సూర్య వంశం, సమర సింహారె డ్డి, సింధూరం, సీతా రామ రాజు, పిల్ల నచ్చింది, చిరంజీవులు, లాహిరి లాహిరి లాహిరి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. తమిళ్, కన్నడ సినిమాలతో ఆక్కడ ఆడియెన్స్ ను కూడా మెప్పించిందీ అందాల తార. అయితే చాలామంది హీరోయిన్ల లాగే సంఘవికి కూడా క్రమంగా హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు సంఘవి 2016లో వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకంది. దీంతో ఈ అమ్మడు క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. 2019లో కొలంజి అనే ఓ తమిళ సినిమాలో చివరిసారిగా నటించింది సంఘవి.
కాగా ఆ మధ్యన జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపించింది సంఘవి. అలాగే సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలోనూ తళుక్కుమంటోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార.తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది. అలాగే తన భర్త, కూతురి ఫొటోలను కూడా అందులో పంచుకుంటోంది. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు వావ్ క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
42 ఏళ్ల వయసులో సంతానం..
కాగా పెళ్లైన చాలా ఏళ్ల వరకు సంఘవికి సంతానం కలగలేదు. చివరికి 2020లో ఈ అందాల తారకు ఛాన్వీ అనే పండంటి మహాలక్ష్మి పుట్టింది. అప్పుడు సంఘవి వయసు సుమారు 42 సంవత్సరాలు. దీంతో తన కూతురిని అల్లారు ముద్దుగా పెంచుతోందీ అందాల తార.
ఫ్యామిలీతో సంఘవి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.