Keerthy Suresh: నా ఫోకస్ మొత్తం దాని పైనే.. అందుకే బ్రేక్ తీసుకున్న
కీర్తి సురేష్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతారా..? లేదంటే పెళ్లి తర్వాత తీసుకుంటున్న గ్యాప్ కంటిన్యూ చేస్తారా..? ఆఫ్టర్ మ్యారేజ్ కీర్తి ఎందుకు ఏ సినిమా సైన్ చేయట్లేదు..? కావాలనే బ్రేక్ తీసుకుంటున్నారా లేదంటే నటనకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారా..? వీటన్నింటికీ సమాధానం వచ్చేసింది.. కాకపోతే నో సౌత్ ఓన్లీ నార్త్ అంటుంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 27, 2025 | 8:17 PM

పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చారు. బేబీ జాన్‌లో అమ్మడి గ్లామర్ షో నెక్ట్స్ లెవల్ అంతే. సినిమా ఫ్లాపైనా.. కీర్తి గ్లామర్ మాత్రం బ్లాక్‌బస్టర్.

బాలీవుడ్‌లో ఈ భామ పేరు రీ సౌండ్ బాగా వస్తుందిప్పుడు. ఊ అనాలే గానీ అక్కడ్నుంచి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి కూడా. కీర్తి ఫోకస్ సైతం బాలీవుడ్‌పైనే ఉందిప్పుడు. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు కీర్తి.

ఇదివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యే టోవినో థామస్‌తో ఓ సినిమాకు సైన్ చేసారు కీర్తి. ఫ్రెండ్ కావడంతో టొవినో సినిమా ఓకే అన్నారు గానీ ఈమె మనసు మాత్రం పూర్తిగా బాలీవుడ్‌పైనే ఉంది.

పైగా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌కు అక్క అనే సిరీస్ చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్‌కు బాలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. రణ్‌బీర్ కపూర్ నెక్ట్స్ సినిమాలో ఈ భామే హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.

దాంతో పాటు మరికొన్ని కథలు కూడా వింటున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ బాలీవుడ్.. నో సౌత్ అంటున్నారు కీర్తి. ఈ లెక్కన అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్నారేమో మరి..?





























