Samantha: ఫేమస్ హైదరాబాదీ స్ట్రీట్ సెలబ్రెటీ రాపర్‌తో సమంత డ్యాన్స్.. వీడియో వైరల్..
ప్రముఖ ర్యాప్/హిప్-హాప్ రియాలిటీ షో MTV వేదికగా కేడెన్ శర్మ తన పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అతడి పాటకు.. పర్ఫార్మెన్స్ కు అక్కడున్న జడ్జెస్ తోపాటు.. నెటిజన్స్ సైతం అవాక్కయ్యారు. కేవలం 23 ఏళ్ల ఈ హైదరాబాదీ ర్యాపర్ మ్యూజికల్ మ్యాజిక్ షోకు వచ్చిన అడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. 'హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీకీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ..' అంటూ స్టేజీపై మెస్మరైజ్ చేశాడు కేడెన్ శర్మ.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ర్యాప్ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లైఫ్ స్టైల్ దగ్గర్నుంచి సౌత్ మూవీస్.. అల్లు అర్జున్ డాన్స్, సాయి పల్లవి సింప్లిసిటిని ప్రస్తావిస్తూ ర్యాప్ సింగర్ కేడెన్ శర్మ పాడిన పాట ఎంత ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ప్రముఖ ర్యాప్/హిప్-హాప్ రియాలిటీ షో MTV వేదికగా కేడెన్ శర్మ తన పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అతడి పాటకు.. పర్ఫార్మెన్స్ కు అక్కడున్న జడ్జెస్ తోపాటు.. నెటిజన్స్ సైతం అవాక్కయ్యారు. కేవలం 23 ఏళ్ల ఈ హైదరాబాదీ ర్యాపర్ మ్యూజికల్ మ్యాజిక్ షోకు వచ్చిన అడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ‘హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీకీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ..’ అంటూ స్టేజీపై మెస్మరైజ్ చేశాడు కేడెన్ శర్మ. హైదరబాద్ లైఫ్ స్టైల్ గురించి చెబుతూ కేడెన్ శర్మ పాడిన పాటకు యూత్ అంతా కేరింతలతో రచ్చ చేశారు.
కేడెన్ శర్మ ర్యాప్ సాంగ్ పెర్ఫార్మెన్స్ పై తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్‌తో సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆ హైదరాబాద్ ర్యాపర్ తో హీరోయిన్ సమంత సందడి చేసింది. ఈ కార్యక్రమానికి సామ్ అతిథిగా హాజరయ్యారు. అక్కడే కేడెన్ శర్మ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా.. సమంత అతడితోపాటు డాన్స్ చేసింది. ఇందుకు సంబందించిన వీడియోను MTV హస్టల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
View this post on Instagram
సమంత ముందు ప్రదర్శన ఇచ్చినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు కేడెన్ శర్మ. సమంతతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “సమంతతో హిస్టరీ బనా దియే” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం కేడెన్ శర్మ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




