Saif Alikhan: నాన్నా.. నువ్వు చనిపోతావా.. ? కొడుకు మాటలు తలుచుకుని సైఫ్ ఎమోషనల్..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సైఫ్.. ఇటీవలే డిశార్చ్ అయ్యారు. దాడి త్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. కత్తిపోటు తర్వాత, తైమూర్ స్వయంగా తన తండ్రిని రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో బంగ్లాదేశ్ జాతీయుడు నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16న జరిగిన ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం సైఫ్ ఎనిమిదేళ్ల కుమారుడు తైమూర్ అతడిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సైఫ్ దాడి ఘటన తెల్లవారుజామున తెలియడంతో అందరూ షాకయ్యారు. ఈ ఘటనలో నిందితుడు సైఫ్‌ను కత్తితో ఆరుసార్లు పొడిచాడు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సైఫ్ వీపు నుంచి రెండు ఇంచుల కత్తిని తొలగించారు వైద్యులు. అనంతరం కొన్ని రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు సైఫ్. ఈ ఘటన తర్వాత కొన్ని రోజులుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న సైఫ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇదే సమయంలో తనపై జరిగిన దాడి ఘటన గురించి వివరించాడు.
బాంబే టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ మాట్లాడుతూ “ఆ దొంగను మనం క్షమించాలని నా కొడుకు తైమూర్ భావిస్తున్నాడు. నాకు వీపులో వీపులో విపరీతమైన నొప్పి కలిగింది. అప్పుడు గమనిస్తే కత్తితో దాడి చేసినట్లుగా తెలిసింది. నా గాయం చూసి కరీనా ఎంతో కంగారు పడింది. ఎంతో మందికి ఫోన్స్ చేసినా తీయలేదు. నాకేం కాదని ఆమెకు ధైర్యం చెప్పాను. కానీ అప్పుడే నా కొడుకు తైమూర్ నా దగ్గరకు వచ్చి నాన్న.. నువ్వు చనిపోతావా ? అని అడిగాడు. అలా ఏం జరగదని చెప్పాను. దాడి తర్వాత నా కొడుకు కూడా నాతో వస్తానని అన్నాడు. అందుకే నాతోపాటు తన కొడుకును తీసుకెళ్లాను. నాకు ఏమైనా జరిగితే ఆ సమయంలో తన కుమారుడు నా పక్కనే ఉండాలని కోరుకున్నాను.. ముగ్గురూ ఆటోలోనే ఆసుపత్రికి వెళ్లాం” అంటూ చెప్పుకొచ్చాడు సైఫ్.
సైఫ్ సంఘటన తర్వాత, ముంబై, ముఖ్యంగా బాంద్రా ప్రాంతం సురక్షితం కాదని చాలా మంది ఆరోపించారు. దీనిపై సైఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “నేను సమాజాన్ని, పోలీసులను లేదా ముంబైని నిందించను. నేను ఇంటిని లోపలి నుండి సరిగ్గా తాళం వేయలేదు కాబట్టి నన్ను నేనే నిందించుకోవాలి. కానీ ఇలాంటిది జరుగుతుందని మేము కలలో కూడా ఊహించలేదు. నా దగ్గర భద్రత కోసం తుపాకీ ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని దగ్గర కూడా ఉంచుకోను. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. దానిని పట్టుకుంటే, అంతకంటే దారుణమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. నాకు బాడీగార్డ్ ని తీసుకెళ్లడం కూడా ఇష్టం ఉండదు. “అది అవసరం లేదని నేను అనుకుంటున్నాను.” అని అన్నారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన







