Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..
మొన్న దుబాయ్, ఇప్పుడు పోర్చుగల్.. మరోసారి హీరో అజిత్ కారు యాక్సిడెంట్ అయ్యింది. అయితే అజిత్‌కు ఎలాంటి గాయలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ తర్వాత పోర్చుగల్‌లో జరుగుతున్న రేస్‌లోనూ పాల్గొంటున్నారు హీరో అజిత్. అక్కడ ప్రాక్టీస్ చేస్తుండగా ఊహించని విధంగా మళ్లీ కారు యాక్సిడెంట్ అయ్యింది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే. అటు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే తనకు ఇష్టమైన కార్ రేసింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఇటీవలే ఆయన నటించిన విడాముయార్చి సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటించింది. ఇక ఇటీవలే దుబాయి కార్ రేసింగ్ లో తన టీంతో కలిసి పాల్గొన్నాడు అజిత్. ఇప్పుడు పోర్చుగల్‌కు వెళ్లి రేసింగ్‌లో పాల్గొంటున్నాడు. కొన్ని రోజులుగా అక్కడ మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ శిక్షణలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అజిత్ మరోసారి ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
బైక్, కార్ రేస్‌లంటే ఇష్టం ఉన్న అజిత్ గత జనవరిలో దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో పాల్గొన్నారు. రేస్ మొదలు కాకముందే ప్రాక్టీస్‌లో బ్రేక్ ఫెయిలవ్వడంతో యాక్సిడెంట్ అయ్యింది. అదృష్టవశాత్తూ అజిత్‌కి ఏమీ కాలేదు. ఈ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పి తర్వాత మళ్ళీ పాల్గొన్నారు. ఈ రేసులో అజిత్ మూడో స్థానంలో నిలిచి అజిత్ చాటారు. దీంతో అజిత్ కుమార్‌కు ‘లిబర్టీ ఆఫ్ ది గేమ్’ అనే అవార్డును కూడా ప్రదానం చేశారు. అజిత్ కుమార్ పోర్చుగల్‌లోని ఎస్టోరిల్‌లోని ఒక ట్రాక్‌లో శిక్షణా సెషన్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ చిన్న ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అజిత్ కు ఎలాంటి గాయలు కాలేదని సమాచారం.
‘మాకు చిన్న ప్రమాదం జరిగింది.’ అదృష్టవశాత్తూ, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమయం నా వైపు ఉంది. కార్ల రేసును మళ్ళీ గెలవడం ద్వారా మన గర్వాన్ని స్థిరపరుచుకుంటాము. “ప్రమాద సమయంలో మాకు మద్దతు ఇచ్చిన మా స్నేహితులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అజిత్ కుమార్ అన్నారు. అజిత్ కుమార్ కు సొంత కార్ రేసింగ్ జట్టు ఉంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన







