Kantara Chapter 1: ‘కాంతార’పై హీరో రణ్‌వీర్ షాకింగ్ కామెంట్స్.. కన్నడిగుల ఆగ్రహం.. క్షమాపణకు డిమాండ్
దేవుడిని అనుకరించకూడదని, దేవుడిని అవమానించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని, దేవుడి గురించి వ్యంగ్యంగా మాట్లాడకూడదని రిషబ్ శెట్టి గతంలో చాలాసార్లు చెప్పాడు. అయితే ఇప్పుడు అతని ముందే, ఒక బాలీవుడ్ స్టార్ కాంతారపై అనుచిత కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. ఇటీవలే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డుల కెక్కింది. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో కొలిచే ఆరాధ్య పంజుర్లీ దేవత ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు రిషభ్ శెట్టి. కాగా కాంతార సినిమా రిలీజ్ సమయంలో కొందరు పంజుర్లీ దేవత వేషాలు వేసుకుని రావడంపై రిషభ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కాంతార’ సినిమాను గౌరవంగా చూడాలని, దేవుళ్లను అవమానించే విధంగా ప్రవర్తించకూడదని, మాట్లాడకూడదని రిషబ్ శెట్టి స్వయంగా చాలాసార్లు చెప్పాడు. కానీ ఇప్పుడు, రిషబ్ శెట్టి ముందు, అంతర్జాతీయ వేదికపై దేవతల గురించి అవమానకరమైన రీతిలో మాట్లాడాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్.
గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ముగింపు కార్యక్రమానికి రణ్‌వీర్ సింగ్ అతిథిగా హాజరయ్యారు. రజనీకాంత్ 50 సంవత్సరాల సినీ సేవకు గౌరవం లభించింది. కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రణవీర్ సింగ్ ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమా గురించి మాట్లాడుతూ, ‘రిషబ్.. నేను థియేటర్‌లో ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ ‘దెయ్యం’ మీ శరీరంలోకి ప్రవేశించే సన్నివేశంలో మీ నటన అద్భుతంగా ఉంది’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే కాంతార సినిమాలో బాగా హైలెట్ అయిన ‘ఓ..’ అనే శబ్దాన్ని స్టేజ్‌పై చేసి చూపాడు రణ్ వీర్ సింగ్. అయితే దీనికి ఆయన కామెడీగా చేయడంతో కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తెలిసి అన్నాడో, తెలియక అన్నాడో తెలియదు కానీ ఇప్పుడు ఈ బాలీవుడ్ హీరోపై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు. అతను వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. మరి దీనిపై రణ్ వీర్ సింగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
కాంతార పై రణవీర్ కామెంట్స్.. వీడియో ఇదిగో..
Dear @RanveerOfficial you don’t know the difference between God and Ghost ….🤦🤦🤦
Chavundi is Goddess not ghost ..🙏 And you literally mocking on big stage..🤦#KantaraChapter1 #RanveerSingh pic.twitter.com/SXV3HZdUfq
— Agasthya ᵀᵒˣᶦᶜ (@sachi_1933) November 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








