AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: తనూజకు నాగార్జున సపోర్ట్.. అయినా ఆమెకు కష్టమే.. బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన శేఖర్ బాషా

బిగ్ బాస్ తెలుగు సీజన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ కంటెస్టెంట్ శేఖర్ బాషా. హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ యాజమాన్యం తనూజ కు సపోర్టుగా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయినా ఆమెకు బిగ్ బాస్ కప్పు కొట్టే సామర్థ్యం లేదని జోస్యం చెప్పాడు శేఖర్ బాష.

Bigg Boss Telugu 9: తనూజకు నాగార్జున సపోర్ట్.. అయినా ఆమెకు కష్టమే.. బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన శేఖర్ బాషా
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Nov 30, 2025 | 6:30 AM

Share

తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది అంకానికి వచ్చేసింది. సెప్టెంబర్ 07 నుంచి రన్ అవుతోన్న ఈ సెలబ్రిటీ రియాల్టీ షో ఇప్పుడు 12 వారం ఎండింగ్ కు చేరుకుంది. అంటే మరో మూడు వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడుతుందన్న మాట. దీంతో బిగ్ బాస్ సీజన్ టాప్ -5లో ఎవరుంటారు? కప్పు కొట్టేదెవరు? అని ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయాలపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో చాలా మంది తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. ఆమె గెలుపును ఎవరూ అడ్డుకోలేరంటూ జోస్యం చెబుతారు. మరోవైపు కల్యాణ్ పడాల విన్ అవుతాడంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బిగ్ బాస్ విన్నర్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శేఖర్ బాషా లేటెస్ట్ సీజన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. టాప్ కంటెస్టెంట్ తనూజకు హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ యాజమాన్యం సపోర్టుగా ఉందని ఆరోపించాడు. ఆమెను విజేతగా నిలిపేందుకు అందరూ ట్రై చేస్తున్నారన్నాడు.

బిగ్‌బాస్-9 విన్నర్ ఎవరంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై మాట్లాడిన శేఖర్ బాష.. నాగార్జున తనూజ కు సపోర్ట్ చేస్తున్నాడని ఆరోపించాడు. ‘ నాకెందుకో నాగార్జున గారు తనూజ మీద ఫేవరిటిజం చూపిస్తున్నట్లు అనిపిస్తుంది.. ఒకవేళ తనూజని తిట్టాల్సి వచ్చినప్పుడు కూడా నువ్వు అలా చేయకమ్మా.. నీకు పొగరు నెత్తికి ఎక్కిందా, తలకెక్కిందా.. అంటూ చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతున్నారు.. ఎక్కడ గట్టిగా మాట్లాడితే ఆమె మళ్లీ ట్యాప్ ఇప్పేస్తుందా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆవిడకి సీరియల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి జస్ట్ ఇలా చిటికేసినంత ఈజీగా ఏడ్చేయగలదు. మిగతా లేడీ కంటెస్టెంట్లతో పోలిస్తే తనూజ బెటరే. కానీ ఒక కామనర్ గెలిస్తే పబ్లిక్‌కి వచ్చే కిక్కు వేరు.. ఒక కామనర్ కప్పు కొడితే అది గ్రేట్ గా ఫీల్ అవుతారు. నాకు తెలిసి కళ్యాణ్‌కే స్కోప్ ఎక్కువ ఉంది. సె లబ్రెటీలకి పీఆర్ టీమ్స్ గట్టిగా ఉంటాయి.. దీనికి తోడు తనూజ లాంటి సీరియల్ యాక్టర్ కు ఆడియన్స్ నుంచి సపోర్టు చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆమె నామినేషన్ లోకి వెళ్లిన ప్రతీసారి టాప్ లోనే కొనసాగుతుంది. కానీ కళ్యాణ్ గ్రాఫ్ అలా కాదు.. జీరో నుంచి పైకి వచ్చింది.. ఇప్పుడు పెరుగుతూనే ఉంది. మరోవైపు తనూజ గ్రాఫ్ ఈ మధ్య తగ్గింది.. కళ్యాణ్ ఇప్పుడు హీరోలానే కనబడుతున్నాడు జనాలకి. కనుక కళ్యాణ్‌ కప్పు కొడితేనే బావుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాష. మరి ఈ మాజీ కంటెస్టెంట్ జోస్యం నిజమవుతుందో ? లేదో? చూడాలలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

ఫైర్ మోడ్ లో కింగ్.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.