AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్‌ సాంగ్ .. టాప్ ట్రెండింగ్‌లో ‘తేనెల వానలా’

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ తెలుగు రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఒకటి ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ‘తేనెల వానలా’ అంటూ లిరిక్స్ తో సాగే ఈ మెలోడీ సాంగ్ సంగీత ప్రియులను బాగా అలరిస్తోంది.

Bigg Boss Telugu: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్‌ సాంగ్ .. టాప్ ట్రెండింగ్‌లో ‘తేనెల వానలా’
Thenela Vanala Song
Basha Shek
|

Updated on: Nov 29, 2025 | 10:39 PM

Share

యూట్యూబ్‌లో ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ హవా నడుస్తోంది. ఈ క్రమంలో ఓ మెలోడీ గీతాన్ని వదిలి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘తేనెల వానలా’ అంటూ సాగే తెలుగు రొమాంటిక్ మెలోడీ గీతాన్ని నవంబర్ 20న వదిలారు. కార్వార్, గోవాలోని అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ, జలపాతాలు, పచ్చని తీరప్రాంతాల్లోని విజువల్స్‌ను చూపిస్తూ కట్టి పడేశారు. ఈ పాటలో ప్రాచి తెహ్లాన్ ఎంతో అందంగా కనిపించారు. మామూలుగానే ఆమెను క్వీన్ ఆఫ్ ది కోర్ట్ అని పిలుస్తారు. ఆమె అందం, నటన, స్క్రీన్ ప్రజెన్స్ ఇలా అన్నింటిని కలగలపి ఆమె ఒక అద్భుతమైన, అందమైన నటిగా అందరి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. భారత నెట్‌బాల్ మాజీ కెప్టెన్ నుంచి ఈ స్థాయి వరకు ఎదిగిన ప్రాచి ప్రయాణం ఎందరికో స్పూర్తిదాయకం. ఇక ఈ సాంగ్‌లో ఆమెతో పాటు బిగ్ బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ కూడా ో పకనువిందు చేశారు. అతని లుక్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌‌తో పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్ తీసుకు వచ్చినట్టు అయింది.

ప్రాచి, నిఖిల్ కలిసి ఈ మెలోడీ గీతాన్ని వీక్షకులకు నచ్చేలా, మెచ్చేలా మలిచారు. మరీ ముఖ్యంగా యశ్వంత్ కుమార్ జీవకుంట్ల కొరియోగ్రఫీ, పాలచర్ల సాయి కిరణ్ సినిమాటోగ్రఫీ ఈ పాటకు ప్రాణం. ఈ పాట విజువల్‌గా అద్భుతంగా ఉండటమే కాకుండా వినసొంపుగానూ ఉండి శ్రోతల్ని మెప్పిస్తోంది.

‘తేనెల వానలా’ పాటను జీ మ్యూజిక్ నిర్మించింది. ఆ సంస్థ యూట్యూబ్ ఛానెల్‌లోనే ఈ పాట ప్రసారం అవుతోంది. వీహ అద్భుతమైన గానం, హృదయాన్ని హత్తుకునేలా చరణ్ అర్జున్ ఇచ్చి బాణీ, సాహిత్యం ఈ పాటను అందరికీ మరింత చేరువ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

‘తేనెల వానలా’ సాంగ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.