AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2: వామ్మో.. అన్ని లక్షలా? జర్మనీలో ‘అఖండ 2’ టికెట్ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2: తాండవం'. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Akhanda 2: వామ్మో.. అన్ని లక్షలా? జర్మనీలో 'అఖండ 2' టికెట్ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?
Akhanda 2
Basha Shek
|

Updated on: Nov 30, 2025 | 8:45 AM

Share

సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తోన్న మరో సినిమా అఖండ 2 : తాండవం. గతంలో సంచలన విజయం సాధించిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ఈ మూవీలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే హర్షాలీ మల్హోత్రా, జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఎన్నడూ లేని విధంగా బాలయ్య అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో ఈ సినిమా కు మంచి బిజినెస్ జరిగింది. అలాగే ఇప్పటికే విదేశాల్లో అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో జర్మనీలో నివసిస్తున్న బాలకృష్ణ ఎన్ఆర్ఐ అభిమాని ఒకరు ఈ సినిమా సూపర్ ఫ్యాన్ టికెట్‌ను ఏకంగా రూ. 2 లక్షలకు కొనుగోలు చేశారు.

జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌కు చెందిన ఎన్ఆర్ఐ అభిమాని రాజ‌శేఖ‌ర ప‌ర్న‌ప‌ల్లి అఖండ 2 సూపర్ ఫ్యాన్ టికెట్ ను కొన్నాడు. ఇందుకోసం ఆయన ఏకంగా రెండు లక్షల రూపాయలు చెల్లించారు. ఈ విష‌యాన్ని చిత్రబృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. దీనిపై జర్మనీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తోన్న తారకరామా ఎంటర్టైన్మెంట్స్ తరఫున శ్రీకాంత్ కుడితిపూడి మాట్లాడుతూ… ‘మేం అనంతపురం నుంచి జర్మనీకి వచ్చాం అయినా బాలయ్య పై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. బాలయ్య సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఇండియాలో చేసినట్టే ఇక్కడ కూడా భారీగా ప్రమోషన్లను నిర్వహిస్తాం’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

బాలయ్య అఖండ 2 సినిమాపై ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.