Orange Movie: ‘ఆరెంజ్’ హీరోయిన్ రూబా గుర్తుందా? పెద్దింటికి కోడలిగా వెళ్లిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
తక్కువ సినిమాల్లో నటించినా కొందరు హీరోయిన్లు బాగా గుర్తుండిపోతుంటారు. ఈ క్రేజీ బ్యూటీ కూడా సరిగ్గా ఈ కోవకు చెందినదే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించింది కేవలం రెండు సినిమాలే. అవి కూడా పెద్దగా ఆడలేదు. కానీ ఈ హీరోయిన్ మాత్రం తెలుగు ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన కల్ట్ క్లాసిక్ సినిమా ఆరెంజ్. 2010లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పటికీ టీవీలో వస్తే మాత్రం వదిలిపెట్టకుండా చూస్తున్నారు. ఇక ఇదే సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తే ఎగబడి మరీ చూశారు ఆడియెన్స్. ముఖ్యంగా ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈ ఆల్బమ్ చాలా మందికి ఫేవరెట్. అసలు విషయానికి వస్తే.. ఆరెంజ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా జెనీలియా నటించింది. అలాగే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో రామ్ చరణ్ లవర్ రూబాగా మరో ముద్దుగుమ్మ నటించింది. ఆ హీరోయిన్ పేరు షాజన్ పదంసీ. ‘రూబా రూబా హే రూబా రూబ్బా రూపం చూస్తే హాయిరబ్బా’ అని ఈ సినిమాలో రామ్ చరణ్ పాడినట్లే ఈ సినిమాలో షాజన్ అందం, యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా యూత్ కు ఫేవరెట్ గా మారిపోయిందీ అందాల తార. ముంబైకి చెందిన షాజన్ పదమ్సీ.. 2009లో ‘రాకెట్ సింగ్’ హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఏడాది రామ్ చరణ్ ‘ఆరెంజ్’ మూవీ తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఆ తర్వాత వెంకటేశ్-రామ్ ‘మసాలా’ సినిమాలోనూ నటించింది. అయితే ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించకపోవడంతో తెలుగులో మరో సినిమా చేయలేదీ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ తో పాటు ఓవరాల్ సినిమా కెరీర్ మొత్తంలో 6-7 సినిమాలు మాత్రమే చేసింది షాజన్ పదమ్సీ. ఇప్పుడు కూడా అడపా దడపా మాత్రమే హింద సినిమాల్లో కనిపిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ముద్దుగుమ్మ మూవీ మ్యాక్స్ థియేటర్స్ CEO ఆశిష్ కనాకియాను వివాహం చేసుకుంది. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఈ ఏడాది జనవరిలో పెళ్లిపీటలెక్కింది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు కొందరు సినీ ప్రముఖులు కూడా తరలి వచ్చారు.
భర్తతో ఆరెంజ్ సినిమా హీరోయిన్..
View this post on Instagram
/h3> ప్రస్తుతం తాత్కాలికంగా సినిమాలకు దూరంగా ఉన్న షాజన్ పదమ్సీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన భర్తతో కలిసున్న ఫొటోలు, వీడియోలను తరచూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








